రాజధాని తరలింపు, పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణపై జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై అధ్యయనానికి ఏర్పాటైన హైపవర్ కమిటీ శుక్రవారం మరోసారి సమావేశమైంది
రాజధాని తరలింపు, పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణపై జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై అధ్యయనానికి ఏర్పాటైన హైపవర్ కమిటీ శుక్రవారం మరోసారి సమావేశమైంది. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో జిల్లాల వారీ అభివృద్ధి రూపకల్పన, టైమ్‌లైన్ ఫిక్స్ చేయాలని కమిటీ అభిప్రాయపడింది.
రాజధాని పేరుతో కృష్ణా-గుంటూరు జిల్లాలు నిర్లక్ష్యమయ్యాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా బందరుపోర్ట్ నిర్మాణ, పూర్తి చేసే తేదీలను ప్రకటించాలని మంత్రి పేర్ని నాని సూచించారు.
Also Read:రాజధాని రచ్చ: గోడ దూకి తప్పించుకొన్న అచ్చెన్న, గద్దె రామ్మోహన్ రావు
అలాగే గుడివాడను గత ప్రభుత్వం గ్రీన్‌జోన్‌గా ప్రకటించడంతో అభివృద్ధి ఆగిందని మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు. అమరావతిలో ఆర్ధిక కార్యకలాపాలు జరిగే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని హైపవర్ కమిటీ అభిప్రాయపడింది.
అసెంబ్లీ పేరుతో సరిపెడితే అమరావతి సాధ్యం కాదని మంత్రులు భావిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమలు మినహా ఇతర పరిశ్రమలు పెద్దగా రాలేదని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. అలాగే అమరావతి నుంచి విశాఖకు ఉద్యోగుల తరలింపు విషయంలో ఎదురయ్యే ఇబ్బందులపై కమిటీ చర్చించింది.
రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సౌకర్యాలను కల్పించాల్సి ఉంటుందని కమిటీ అభిప్రాయపడింది. మూడు రాజధానుల విషయంలో మెజార్టీ అంశాలపై, ఈ నెల 13వ తేదీన మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
కాగా రాజధానిని అమరావతిలో కొనసాగించడం ఇష్టం లేకే కృష్ణా-గుంటూరు జిల్లాలు నిర్లాక్ష్యానికి గురయ్యాయని మంత్రులు వ్యాఖ్యానించి వుండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
Also Read:సీరియస్ చర్చ: రోజాను తల నిమిరి ఊరడించిన వైఎస్ జగన్
ఏపీ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన హైపవర్ కమిటీ మంగళవారం నాడు విజయవాడలో సమావేశమైంది. ఈ నెల 20వ తేదీలోపుగా హైలెవల్ కమిటీ రిపోర్టును ఇవ్వనుంది. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలనే డిమాండ్‌తో రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు 22 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు.
హైపవర్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలను సీఎం జగన్‌కు నివేదిక ఇవ్వనుంది కమిటీ. ఈ కమిటీ రిపోర్టు ఆధారంగా సీఎం జగన్ నిర్ణయం తీసుకోనున్నారు. రెండు కమిటీలు కూడ పరిపాలన వికేంద్రీకరణకు మొగ్గు చూపాయి.