తెలుగుదేశం-జనసేన కూటమి ప్రకటించిన తొలి జాబితాలో మహిళలు, విద్యావంతులు, యువతకు ప్రాధాన్యత ఇచ్చింది.
అమరావతి: తెలుగుదేశం-జనసేన కూటమి శనివారం నాడు తొలి జాబితాను ప్రకటించింది. తొలి జాబితాలో 23 మంది కొత్తవారికి అవకాశం కల్పించింది తెలుగు దేశంపార్టీ. తెలుగుదేశం పార్టీ 94 మంది, జనసేన ఐదు మంది అభ్యర్థులకు తొలిజాబితాలో చోటు కల్పించాయి.
also read:తొలి జాబితా: టీడీపీ సీనియర్లకు దక్కని చోటు, ఎందుకంటే?
undefined
తెలుగుదేశం పార్టీ ఇవాళ 94 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే తొలి జాబితాలో తెలుగు దేశం సీనియర్లకు చోటు దక్కలేదు. బీజేపీతో పొత్తుతో పాటు జనసేన పోటీ చేసే స్థానాల విషయంలో స్పష్టత రానందున సీనియర్లకు చోటు దక్కలేదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీ లోపుగా పొత్తు విషయమై బీజేపీ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. టీడీపీ-జనసేన కూటమిలో చేరే విషయమై బీజేపీ నుండి స్పష్టత వచ్చిన తర్వాత మార్చి 1 లేదా 2 వ తేదీ రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. విద్యావంతులకే ఎక్కువగా సీట్లను కేటాయించిన విషయాన్ని చంద్రబాబు ప్రకటించారు.
also read:టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితా విడుదల: 94 స్థానాల్లో టీడీపీ, 5 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన
తొలిజాబితాలో 14మంది మహిళలకు టీడీపీ టిక్కెట్లను కేటాయించింది.పెనుకొండ- సవిత, రాప్తాడు- పరిటాల సునీత, సింగనమల(ఎస్సీ)- బండారు శ్రావణి, పాణ్యం- గౌరు చరితారెడ్డి, ఆళ్లగడ్డ- భూమా అఖిలప్రియ, కడప- మాధవిరెడ్డి, సూళ్లూరుపేట(ఎస్సీ)- విజయశ్రీ, నందిగామ(ఎస్సీ)- తంగిరాల సౌమ్య, తుని- యనమల దివ్య, పాయకరావుపేట(ఎస్సీ)- వంగలపూడి అనిత, సాలూరు(ఎస్సీ)- గుమ్మడి సంధ్యారాణి, విజయనగరం-అదితి గజపతిరాజు, అరకు-జగదీశ్వరీ, నెల్లిమర్ల-లోకం మాధవి(జనసేన)లకు టికెట్లు కేటాయించారు.
also read:కూటమి బలంగా ఉండాలనే తక్కువ సీట్లలో పోటీ: పవన్ కళ్యాణ్
జనసేనకు 23 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలను కేటాయించింది తెలుగు దేశం పార్టీ. అయితే ఇవాళ ప్రకటించిన జాబితాలో ఐదుగుు పేర్లను మాత్రమే జనసేన ప్రకటించింది. మిగిలిన 19 మంది అభ్యర్థుల పేర్లను త్వరలోనే ప్రకటించనున్నట్టుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. బీజేపీ కూడ ఈ కూటమిలో చేరుతుందనే ఆశాభావంతో ఈ రెండు పార్టీల నేతలున్నారు. బీజేపీ తన వైఖరిని ప్రకటించిన తర్వాత రెండో జాబితాను ప్రకటించనున్నారు.