ఏపీ: 24 గంటల్లో 208 మందికి పాజిటివ్.. 20,67,083కి చేరిన సంఖ్య, చిత్తూరులో అత్యధికం

Siva Kodati |  
Published : Nov 14, 2021, 06:31 PM ISTUpdated : Nov 14, 2021, 06:32 PM IST
ఏపీ: 24 గంటల్లో 208 మందికి పాజిటివ్.. 20,67,083కి చేరిన సంఖ్య, చిత్తూరులో అత్యధికం

సారాంశం

ఏపీలో కొత్తగా 208 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 247 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 3,086 మంది చికిత్స పొందుతున్నారు

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 208 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,67,083కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,415కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 247 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,49,582కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 32,630 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,99,83,209కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 3,086 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 12, చిత్తూరు 53, తూర్పుగోదావరి 8, గుంటూరు 19, కడప 10, కృష్ణ 32, కర్నూలు 4, నెల్లూరు 18, ప్రకాశం 8, శ్రీకాకుళం 7, విశాఖపట్నం 13, విజయనగరం 6, పశ్చిమ గోదావరిలలో 18 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

Markapuram Accident:కదిలిస్తే కన్నీళ్లే.. మార్కాపురం బస్సుబాధితుల పరిస్థితిఇదీ | Asianet News Telugu
Markapuram Bus Accident Aftermath | Vehicles Removed Using Crane Accident Spot | Asianet News Telugu