ప్రత్యేక హోదా విస్మరించారు, విభజన హమీలు అమలు కాలేదు: సదరన్ జోనల్ కౌన్సిల్‌లో జగన్

Published : Nov 14, 2021, 05:12 PM ISTUpdated : Nov 14, 2021, 05:14 PM IST
ప్రత్యేక హోదా విస్మరించారు, విభజన హమీలు అమలు కాలేదు: సదరన్ జోనల్ కౌన్సిల్‌లో జగన్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలు చేయలేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు కాలేదని సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో జగన్ గుర్తు చేశారు.

తిరుపతి: రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇస్తానన్న ప్రత్యేక హోదా హామీని విస్మరించారని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.విభజన చట్టంలో ఇచ్చిన హామీలుఏడేళ్లైనా అమలుకాలేదన్నారు.సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఆదివారం నాడు ప్రసంగించారు. తొలుత ఈ సమావేశానికి హాజరైన అతిథులను సీఎం జగన్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ప్రారంభోపాన్యాసం చేశారు.ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన సమస్యలను  ప్రస్తావించారు. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి Amit Shah అధ్యక్షత వహించారు.తెలంగాణ నుండి హోం మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ లు ఈ సమావేశానికి హాజరయ్యారు.  ఈ సమావేశానికి కేరళ రాష్ట్ర మంత్రి రాజన్, తమిళనాడు రాష్ట్రం నుండి విద్యా శాఖ మంత్రి పొన్నుమూడి హాజరయ్యారు. పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్  దేవేంద్ర కుమార్ జోషీ లు హాజరయ్యారు.

రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్ధేశిత సమయంలో పరిష్కారం కావాల్సిన అవసరం ఉందన్నారు.. దీని కోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం Ys jagan కోరారు.రాష్ట్ర విభజనతో ఏపీ రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ జరగని విషయాన్ని సీఎం గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013-14 ధరల సూచీతో ఏపీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు..తెలంగాణ నుండి రావాల్సిన విద్యుత్ బకాయిలను ఇప్పించాలని జగన్   Southern Zonal Council సమావేశంలో కోరారు.గత ప్రభుత్వ హయంలో రుణాలపై పరిమితి దాటిందని జగన్ గుర్తు చేశారు.ప్రస్తుతం తమ రాష్ట్రం తీసుకొనే రుణాలపై కోత విధిస్తున్నారన్నారు.సీఎం జగన్ ప్రస్తావించిన  అంశాలను పరిగణనలోకి తీసుకొంటామని కేంద్ర మంత్రి అమిత్ షా హమీ ఇచ్చారు. వీటన్నింటికి తప్పని సరిగా న్యాయ పరమైన పరిష్కారం చూపుతామని తెలిపారు.

also read:తిరుపతిలో ప్రారంభమైన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం: అతిథులను సన్మానించిన జగన్

రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం–1956 ప్రకారం ఐదు జోనల్‌ కౌన్సిల్స్‌ ఏర్పాటయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలతో ఏర్పడ్డ కౌన్సిల్‌ ఐదోది.రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం, కేంద్రం –రాష్ట్రాల మధ్య చక్కటి సంబంధాలను నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా జోనల్‌ కౌన్సిల్స్‌ను ఏర్పాటు చేశారు.  మొట్టమొదటి సౌత్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం 1957 జులై 11న మద్రాసులో నిర్వహించారు. మొత్తంగా ఇప్పటి వరకూ 28 సార్లు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండళ్ల సమావేశాలు జరిగాయి. చివరగా 2018 సెప్టెంబరు 18,న సౌత్‌ జోనల్‌ కమిటీ సమావేశం బెంగళూరులో జరిగింది. 

 ఈ సమావేశాలకు కేంద్ర హోం శాఖ మంత్రి చైర్మన్‌గా, రొటేషన్‌ పద్ధతిలో ఒక్కో రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రులెవరైనా రాలేకపోతే మంత్రులు హాజరవుతారు. మూడేళ్ల తర్వాత మళ్లీ ఈ సమావేశం ఆదివారం తిరుపతిలో జరుగుతోంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా ఆర్థిక, సామాజిక పరమైన అంశాలు చర్చిస్తారు. ఈ అంశాల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తారు. రాష్ట్రాల మధ్య పెండింగ్‌ అంశాలు, సరిహద్దు వివాదాలు, భాషా పరంగా మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం, అంతర్‌ రాష్ట్ర రవాణా, రాష్ట్రాల పునర్‌ విభజన చట్టంలో పెండింగ్‌ అంశాలు.. తదితర విషయాలన్నీ ప్రస్తావనకు వస్తాయి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి
IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!