2017: మినిస్టర్ ఆఫ్ ది ఇయర్

First Published Dec 28, 2017, 12:55 PM IST
Highlights
  • ఈ సంవత్సరంలో నారా లోకేష్ నే మినిష్టర్ ఆఫ్ ది ఇయర్ గా చెప్పుకోవాలి.

ఈ సంవత్సరంలో నారా లోకేష్ నే ‘మినిష్టర్ ఆఫ్ ది ఇయర్ ’గా చెప్పుకోవాలి. ప్రజాప్రతినిధిగా ఎటువంటి అనుభవం లేకపోయినా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారంటే వారసత్వమే కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంత్రివర్గంలో కూడా ప్రత్యేకంగా గ్రామీణాభివృద్ధి, ఐటి లాంటి కీలకమైన శాఖలను ఎంచుకోవటంలో లోకేష్ ఆలోచనేంటో అర్దమవుతోంది. అయితే, ముఖ్యమంత్రి కుమారుడనే బ్రాండ్ నుంచి బయటపడేందుకు ఆయన విపరీతంతా శ్రమపడుతున్నారు. ఇదే ఆయనన్ను విలక్షణమయిన నాయకుడిగా తయారుచేసింది. 2017లో మినిస్టర్ అఫ్ ది ఇయర్ గా మార్చింది.

 

1-కెటిఆర్ తో పోటి: లోకేష్ మంత్రయ్యేనాటికే తెలంగాణాలో కెటిఆర్ గ్రామీణాభివృద్ధి, ఐటి శాఖల మంత్రిగా ఉన్నారు. పలు దేశాల నుండి వివిధ సంస్ధలు హైదరాబాద్ కు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే.  అందుకనే పరిశ్రమలను ఏపికి తీసుకురావటంలో లోకేష్ కూడా కెటిఆర్ తో పోటీ పడాలని అనుకున్నారు.  ఆ దిశలో పని ప్రారంభించారు. అయితే, హైదరాబాద్ లాగా అమరావతి లోకేశ్ కు వడ్డించిన విస్తరి కాదు. ఇన్వెస్టర్లను ఒప్పించేందుకు లోకేశ్ చాలా కష్టపడుతున్నారు. వాళ్లను ఆకట్టకోవడమే ఆయన ముందున్న సవాల్.

2-సక్సెస్ రేటెంత?: కెటిఆర్ తో పోటీ పడాలనుకోవటంలో తప్పు లేదు . విశాఖపట్నం, విజయవాడలో ఏ నగరం కూడా హైదరాబాద్ తో పోటీ పడే స్ధాయి లేదు.  అయినా విదేశీ సంస్ధలను ఏపికి తేవాలని లోకేష్ దేశదేశాలు తిరుగుతున్నారు. తన వంతుగా కష్టపడుతున్నారు. చాలా మంది ఇన్వేస్టర్లు ఆంధ్ర సందర్శిస్తున్నారు. ఇదంతా లోకేశ్ కృషి అనక తప్పదు.

3-చిన్న వయస్సులోనే పెద్ద బాధ్యతలు: చిన్న వయస్సులోనే లోకేష్ పెద్ద బాద్యతలు నిర్వర్తిస్తున్నారు.  రెండు కీలకమయిన శాఖల(ఐటి, పంచాయతీ రాజ్ ) మంత్రిగా ప్రభుత్వంలో బిజిగా ఉంటున్నారు. అదే సమయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు మోస్తున్నారు. జిల్లా స్ధాయిల్లో ఎక్కడికక్కడ గొడవలతో నేతలు రోడ్డున పడుతున్నా సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ ఎక్కడ అదుపు తప్పకుండా జిల్లాలన్నీ తిరుగుతున్నారు. పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.

4-వక్తగా ఎదిగేందుకు ప్రయత్నాలు: బహిరంగ సభల్లో కానీ కార్యకర్తల సమావేశాల్లో గానీ లోకేష్ మాట్లాడేటప్పుడు ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకదశలో లోకేష్ ప్రసంగంలోని అంశాలు ప్రత్యర్ధులకు అస్త్రాలుగా మారిన విషయం కూడా అందరూ చూసిందే. అటువంటి దశనుండి మెల్లిగా మంచివక్తగా పరిణతి చెందేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారు. మంచివక్తగా ఎదగాలంటే ముందు విషయ పరిజ్ఞానం అవసరమని గుర్తించారు. ఇపుడదే పనిలో ఉన్నారు.

5-అభివృద్ధికి పునాది: ఏ అభివృద్ధి కూడా రాత్రికి రాత్రే జరగదన్న విషయం అందరికీ తెలిసిందే. రాత్రికి రాత్రి ఒక వ్యవస్ధ దెబ్బతినొచ్చు గానీ పూర్తి స్ధాయిలో అభివృద్ధి జరగాలంటే చాలా కాలం పడుతుంది. లోకేష్ ఇపుడా పనిలోనే ఉన్నారు. విదేశీ సంస్ధలను ఏపికి తీసుకురావటంలో చొరవ చూపుతున్నారు. అంతర్జాతీయ సంస్ధల యాజమాన్యాలను కలిసి ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. గూగుల్ ఎక్స్ ఏపికి రావాలనుకోవటంలో లోకేష్ పాత్రే ఎక్కువ. ఇది 2017లో ఎపి ఘనవిజయంగా చెప్పవచ్చు.

6-రానున్నది ఎన్నికల కాలం. కాబట్టే పార్టీపై బాగా దృష్టి పెట్టాలని లోకేష్ అనుకున్నారు. ఎంఎల్ఏల పనితీరుపై ఫీడ్ బ్యాక్ తెప్పించుకోవటం, అభ్యర్ధులను మార్చాల్సిన నియోజకవర్గాలపై దృష్టి సారించటం, కొన్ని నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలకు ప్రత్యామ్నాయాలను చూడటం లాంటి పనులతో బిజీగా ఉన్నారు. లోకేష్ పనితీరు ఫ్రండ్లీగా ఉంటున్నదని ప్రశంసలొస్తున్నాయి. దురుసు గా మాట్లాడకోపవడం, అందరితో కలసి మెలసి ఉండటం, సింపుల్ గా కనిపించడంతో ఆయన పార్టీలో అందరికీ దగ్గరయ్యారని పార్టీ నేతలు చెబుతున్నారు.

 

click me!