చంద్రబాబు జిల్లాలో జగన్

First Published Dec 28, 2017, 10:50 AM IST
Highlights
  • చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోకి వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుపెట్టారు.

చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోకి వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుపెట్టారు. గురువారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో తంబళ్ళపల్లి నియోజకవర్గంలోని ఎద్దులవారి కోట గ్రామంలోకి జగన్ ప్రవేశించారు. జిల్లా సీనియర్ నేత, పుంగనూరు ఎంఎల్ఏ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపి మిధున్ రెడ్డి తదితరులు జగన్ కు స్వాగతం పలికారు. జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 260 కిలోమీటర్లను తన పాదయాత్ర ద్వారా జగన్ కవర్ చేయనున్నారు. సుమారు 20 రోజుల పాదయాత్రలో మొత్తం 150 గ్రామాలను టచ్ చేస్తారు. పాదయాత్ర దాదాపు రూరల్ ప్రాంతాల్లోనే సాగేట్లుగా రూట్ మ్యాప్ తయారుచేసారు. చిత్తూరు, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, కుప్పం పట్టణాలు మినహా మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల్లో దాదాపు అన్నీ మండలాల్లో జగన్ పాదయాత్రలో కవర్ చేస్తారు. మైనారిటీలు, చేనేత సామాజికవర్గాలతో సమావేశాలుంటాయి. అదే విధంగా ఐదుచోట్ల బహిరంగ సభలు కూడా నిర్వహించేందుకు ప్లాన్  చేసారు.

click me!