కృష్ణా జిల్లాలో విషాదం: సాంబారు గిన్నెలో పడి రెండేళ్ల చిన్నారి మృతి

Published : Feb 14, 2022, 10:30 PM IST
కృష్ణా జిల్లాలో విషాదం: సాంబారు గిన్నెలో పడి రెండేళ్ల చిన్నారి మృతి

సారాంశం

కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం కలగర గ్రామంలో విషాదం చోటు చేసుకొంది. సాంబారు గిన్నెలో పడి రెండేళ్ల తేజస్విని మరణించింది.

విజయవాడ: కృష్ణాజిల్లా Vissannapeta మండలం కలగరలో విషాదఛాయలు అలుముకున్నాయి. Sambar గిన్నెలో పడి రెండేళ్ల Tejaswini మరణించింది. కారుమంచి శివ, బన్ను దంపతుల కూతురు తేజస్విని. ఆ చిన్నారి వయస్సు రెండేళ్లు. 

తేజస్విని తీసుకొని దంపతులు తమ వాడలోని పుట్టిన రోజు వేడుకలకు ఆదివారం నాడు  వెళ్లారు.  అయితే పుట్టిన రోజును పురస్కరించుకొని భోజనాలు ఏర్పాటు చేశారు.

 అయితే భోజనాలు చేసే ప్రదేశంలోని కుర్చీలో కూర్చొని తేజస్విని ఆడుకొంటూ ప్రమాదవశాత్తు  సాంబార్ గిన్నెలో పడిపోయింది. దీంతో తేజస్వినిని కుటుంబ సభ్యులు తిరువూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం విజయవాడకు తరలించారు. విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం నాడు తేజస్విని మరణించింది. పసిపాప మృతి తో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి..

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?