కృష్ణాలో అత్యధికం: ఏపీలో 8,87,238కి చేరిన కరోనా కేసులు

Siva Kodati |  
Published : Jan 26, 2021, 08:32 PM ISTUpdated : Jan 26, 2021, 10:29 PM IST
కృష్ణాలో అత్యధికం: ఏపీలో 8,87,238కి చేరిన కరోనా కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 172 మందికి కోవిడ్ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కలిపి ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,87,238కి చేరింది. నిన్న ఒక్కరోజు కోవిడ్ కారణంగా ఒకరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 7,150కి చేరుకుంది

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 172 మందికి కోవిడ్ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కలిపి ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,87,238కి చేరింది.

నిన్న ఒక్కరోజు కోవిడ్ కారణంగా ఒకరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 7,150కి చేరుకుంది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 203 మంది కోవిడ్  నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,78,731కి చేరింది.

ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,357 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 38,323 మందికి కరోనా టెస్టులు చేయడంతో ఇప్పటి వరకు మొత్తం పరీక్షల సంఖ్య 1,29,42,153కి చేరింది.

నిన్న ఒక్కరోజు అనంతపురం 7, చిత్తూరు 11, తూర్పుగోదావరి 21, గుంటూరు 22, కడప 15, కృష్ణా 39, కర్నూలు 1, నెల్లూరు 3, ప్రకాశం 4, శ్రీకాకుళం 10, విశాఖపట్నం 34, పశ్చిమ గోదావరిలలో 5 కేసులు నమోదయ్యాయి. 
 

 

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu
CM Chandrababu: నిధులు లేవని ప్రాజెక్ట్స్ నిలపకండి అధికారులకు సీఎం ఆదేశాలు | Asianet News Telugu