Alla Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అస్వస్థత.. వైద్యులు ఏమన్నారంటే..

Published : Nov 28, 2021, 10:23 AM ISTUpdated : Nov 28, 2021, 10:30 AM IST
Alla Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అస్వస్థత.. వైద్యులు ఏమన్నారంటే..

సారాంశం

గుంటూరు జిల్లా మంగళగిరి (Mangalagiri) ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఆయనకు ఛాతి నొప్పితో రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే గుంటూరులోని సాయిభాస్కర్ ఆస్పత్రికి తరలించారు.

గుంటూరు జిల్లా మంగళగిరి (Mangalagiri) ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఆయనకు ఛాతి నొప్పితో రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే గుంటూరులోని సాయిభాస్కర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. అయితే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అస్వస్థతకు గురయ్యారనే వార్త తెలుసుకున్న వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా ఆందోళన చెందాయి. అయితే బాగానే ఉన్నారని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

ఇక, శనివారం ఎమ్మెల్యే ఆర్కే.. మంగళగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ది  పనులను పరిశీలించారు. తాడేపల్లి బ్రహ్మానందపురంలో కొండవీటివాగు నీరు పారురదలకు కల్వర్టు నిర్మాణ పనులను, కొలనుకొండ వద్ద రోడ్డు, మంగళగిరిలోని రత్నాల చెరువులో రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ఈ క్రమంలోనే ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. అంతేకాకుండా శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో జరిగిన పూజల్లో ఆయన పాల్గొన్నారు. 

సాయంత్రం పెదకాకానిలోని తన నివాసానికి బయలుదేరిన ఎమ్మెల్యే ఆర్కేకు స్వల్పంగా ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు  ఆయనను గుంటూరులోని సాయిభాస్కర్ ఆస్పత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్