ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కేసులు: కొత్తగా 1608 మందికి పాజిటివ్.. చిత్తూరు, నెల్లూరుల్లో తీవ్రత

Siva Kodati |  
Published : Sep 10, 2021, 05:25 PM ISTUpdated : Sep 10, 2021, 05:27 PM IST
ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కేసులు: కొత్తగా 1608 మందికి పాజిటివ్.. చిత్తూరు, నెల్లూరుల్లో తీవ్రత

సారాంశం

ఏపీలో కొత్తగా 1,608 కరోనా కేసులు నమోదవ్వగా.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,107 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 15,119 మంది చికిత్స పొందుతున్నారు.  

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,608 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,24,755కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 6 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,970కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల నెల్లూరు 2, ప్రకాశం 2, విశాఖపట్నం 1, పశ్చిమ గోదావరిలలో ఒక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1,107 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,95,666కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 67,911 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,72,29,781కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 15,119 మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 34, చిత్తూరు 281, తూర్పుగోదావరి 213, గుంటూరు 141, కడప 126, కృష్ణ 161, కర్నూలు 18, నెల్లూరు 261, ప్రకాశం 114, శ్రీకాకుళం 21, విశాఖపట్నం 70, విజయనగరం 14, పశ్చిమ గోదావరిలలో 154 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.
 

PREV
click me!

Recommended Stories

PMMVY Scheme : తెలుగు మహిళలకు బంపరాఫర్.. ప్రభుత్వం నుండి ఫ్రీగా రూ.6,000 అకౌంట్లో వచ్చిపడతాయి
Heavy Rain Alert : తెలుగు ప్రజలారా కాస్కొండి.. ఇక భారీ వర్షాలు షురూ, ఈ జిల్లాలకు అలర్ట్ జారీ