వాలంటీర్లకు పరీక్షలు.. ఏపీ సర్కార్ నోటిఫికేషన్, ఉత్తీర్ణత సాధిస్తేనే

By Siva KodatiFirst Published Sep 10, 2021, 4:12 PM IST
Highlights

ఈ నెల 28 నుంచి 30 వరకు ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించనుంది. ఈ  మేరకు పరీక్ష నిర్వహణపై నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీపీఎస్సీ. మొత్తం 100 మార్కులకు 40 మార్కులు వస్తేనే ప్రోబేషనరీకి అర్హులని ప్రభుత్వం  తెలిపింది

ఈ నెల 28 నుంచి 30 వరకు ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించనుంది. ఈ  మేరకు పరీక్ష నిర్వహణపై నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీపీఎస్సీ. పబ్లిక్ సర్వీస్ కమీషన్ వెబ్‌సైట్‌లో ఓటీపీఆర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని .. ఓటీపీఆర్‌లో వచ్చే యూజర్ ఐడీతో ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అవకాశం వుంది. ఈ నెల 13 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరించనున్నారు. మొత్తం 100 మార్కులకు 40 మార్కులు వస్తేనే ప్రోబేషనరీకి అర్హులని ప్రభుత్వం  తెలిపింది. అక్టోబర్ 2 నాటికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు రెండేళ్లు పూర్తి కానుంది. ఏపీ వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 1.34 లక్షల మంది ఉద్యోగులకు ప్రొబేషన్ పూర్తి కానుంది. 

click me!