ప్రకాశం జిల్లాలో విషాదం: పాకాల సముద్రంలో మునిగి ఇద్దరు మృతి, మరో నలుగురు సురక్షితం

Published : Sep 10, 2021, 05:15 PM IST
ప్రకాశం జిల్లాలో విషాదం: పాకాల సముద్రంలో మునిగి ఇద్దరు మృతి, మరో నలుగురు సురక్షితం

సారాంశం

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో శుక్రవారం నాడు విషాదం చోటు చేసుకొంది. విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు పాకాల సముద్రంలో మునిగి మృతి చెందారు. మరో నలుగురిని స్థానికులు రక్షించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఒంగోలు:ప్రకాశం జిల్లా సింగారయకొండలో శుక్రవారం నాడు విషాదం చోటు చేసుకొంది. విహారయాత్రకు వచ్చి విషాదాన్ని కొనితెచ్చుకొన్నారు. సింగరాయకొండ మండలం పాకాలలోని పాకాల సముద్రంలో మునిగి ఇద్దరు మరణించారు. మరో నలుగురిని స్థానికలు రక్షించారు. వినాయకవతిని పురస్కరించుకొని ఆరుగురు స్నేహితులు విహారయాత్ర కోసం  పాకాల సముద్రానికి వచ్చారు. 

పాకాల సముద్రంలో స్నానానికి దిగారు. అయితే ఈ ఘటనలో ఇద్దరు నీటిలో కొట్టుకుపోయారు. మరో నలుగురు కూడ నీటిలో కొట్టుకుపోతున్నసమయంలో స్థానికులు వారిని కాపాడారు. మృతి చెందిన వారిని మర్రిపూడి మండలం చిమటకు చెందిన తేజ, శేఖర్ లు గుర్తించారు.

వినాయకచవితి రోజున స్నేహితులతో సంతోషంగా గడిపేందుకు వచ్చి ఇద్దరు మృత్యువాత పడడంతో మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.పాకాల సముద్రంలో స్నానానికి వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.  ఈ ఘటనపై  బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Vemireddy Prashanthi Emotional Speech In Mahanadu | వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు
Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్