ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘాల నేతలతో ఆర్ధిక శాఖాధికారులు చర్చలపై ఉద్యోగ సంఘాల నేతలు గురువారం నాడు భేటీ అయ్యారు. ఆర్ధిక శాఖాధికారుల తీరుపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. భవిష్యత్తు కార్యాచరణను వచ్చే ఏడాది జనవరి 3న ప్రకటిస్తామని చెప్పారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల Prc ఫిట్ మెంట్ పై ఉద్యోగ సంఘాల నేతలతో గురువారం నాడు andhra pradesh రాష్ట్ర ఆర్ధిక శాఖాధికారులు భేటీ అయ్యారు. సుమారు 15 ఉద్యోగ సంఘాల నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. పీఆర్సీ ఫిట్‌మెంట్ పై ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు. అయితే ఈ సమావేశంలో కూడా పీఆర్సీ ఫిట్‌మెంట్ పై కూడా ఎటూ తేలలేదు. అయితే వచ్చే ఏడాది జనవరి మూడున తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు.
also read:పీఆర్సీపై పీటముడి : రేపు మరోసారి ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు
undefined
ఇవాళ ఆర్ధిక శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో తొమ్మిది ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి. అయితే ఈ సమావేశంలో కూడా ఆర్ధిక శాఖాధికారులు వ్యవహరించిన తీరుపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. 14.29 శాతం ఫిట్‌మెంట్ ఇస్తామని Finance అధికారులు చెప్పడాన్ని Employees Union నేతలు తప్పుబడుతున్నారు. అధికారుల తీరుపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. చర్చల పేరుతో పిలిచి ఉద్యోగ సంఘాలను ప్రభుత్వంఅవమానపరుస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. పీఆర్సీ ఫిట్‌మెంట్ పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఉద్యోగ సంఘాల నేతలు తప్పుబట్టారు.
జనవరి 3న భవిష్యత్తు కార్యాచరణ: ఉద్యోగ సంఘాల జేఎసీ నేత బండి శ్రీనివాస్
14.29 శాతం పీఆర్సీ ఇవ్వాలన్న సీఎస్ కమిటీ సిఫారసుపై చర్చించాల్సిన అవసరం లేదని ఉద్యోగ సంఘాల జేఏసీ నేత Bandi Srinivas చెప్పారు.వచ్చే ఏడాది జనవరి 3న సమావేశమై తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.27 శాతంపైన పీఆర్సీ ఫిట్ మెంట్ ఇచ్చేలా చర్చలకు పిలవాలని ఆయన కోరారు.వైద్య ఖర్చులు సహా ఏ బిల్లు కూడా ప్రభుత్వం నుండి రావడం లేదన్నారు. పీఆర్సీపై తేలుస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు తేల్చలేదని ఆయన ప్రశ్నించారు.
ఉద్యోగులను అవమానిస్తున్నారు: బొప్పరాజు వెంకటేశ్వర్లు
చర్చల పేరుతో పిలిచి ఉద్యోగ సంఘాల నేతలను పదే పదే అవమానిస్తున్నారని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. సంప్రదాయాలకు ప్రభుత్వం తిలోదకాలు ఇస్తుందని విమర్శించారు. ఏపీ ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందో తమ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని Bopparaju Venkateshearlu చెప్పారు.
రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 75 వేల కోట్లు ఉద్యోగులకే ఖర్చు పెడుతున్నామని అధికారులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. రాష్ట్రానికి. వచ్చే ఆదాయంలో ఉద్యోగుల జీతాలకు 33 శాతం మాత్రమే ఖర్చు పెడుతున్నారని చెప్పారు.పీఆర్సీపై ఆశుతోష్ మిశ్రా నివేదికను యధాతథంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తిరుపతిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించే సమయంలో వారం రోజుల్లో పీఆర్సీని ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం జగన్ చెప్పారు. అయితే ఆ తర్వాత సీఎస్ పీఆర్సీపై నిపుణుల కమిటీ నివేదికను సీఎంకు అందించారు. 72 గంటల తర్వాత పీఆర్సీ సమస్య పరిష్కారం అవుతుందని సీఎస్ చెప్పారు. సీఎస్ ఈ ప్రకటన చేసి రెండు వారాలు దాటినా ఈ సమస్య పరిష్కారం కాలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.