రోడ్డు దాటుతూ గాయపడిన పాము.. 12 కుట్లు వేసి ప్రాణాలు కాపాడి....

By AN TeluguFirst Published Nov 27, 2021, 8:16 AM IST
Highlights

రాజమహేంద్రవరంలో జేఎన్ రోడ్డు దాటుతున్న అయిదున్నర అడుగుల నాగుపాము ఓ ద్విచక్ర వాహనం కిందపడి గురువారం రాత్రి గాయపడింది. విక్రమ్ జైన్ అనే వ్యక్తి, దాన్ని పట్టుకుని వన్యప్రాణి విభాగం వైద్యుడు ఆండ్ర ఫణీంద్రకు చూపించారు. నాగుపాము ఎడమవైపు దవడ కింది భాగం ఛిద్రమవడంతో 12 కుట్లు వేసి ఇంజక్షన్లు ఇచ్చారు.

రాజమహేంద్రవరం : మనుషులనే కాదు పశుపక్ష్యాదులను కూడా కరుణతో చూడడమే అసలైన మానవత్వం. అలాంటి Humanityతో కూడిన సంఘటనలు అప్పుడప్పుడు, అక్కడక్కడా కనిపిస్తూ.. ఇంకా మనుషుల్లో కరుణ, జంతుప్రేమ, కారుణ్యం పోలేదని నిరూపిస్తుంటాయి. అలాంటివి విన్నప్పుడు మనసు హాయతో నిండిపోతుంది. అలాంటి ఘటనే జరిగింది రాజమహేంద్రవరంలో...

Rajamahendravaramలో జేఎన్ రోడ్డు దాటుతున్న అయిదున్నర అడుగుల నాగుపాము ఓ ద్విచక్ర వాహనం కిందపడి గురువారం రాత్రి గాయపడింది. విక్రమ్ జైన్ అనే వ్యక్తి, దాన్ని పట్టుకుని వన్యప్రాణి విభాగం వైద్యుడు ఆండ్ర ఫణీంద్రకు చూపించారు. నాగుపాము ఎడమవైపు దవడ కింది భాగం ఛిద్రమవడంతో 12 stitches వేసి ఇంజక్షన్లు ఇచ్చారు.

ఇది ఆరోగ్యంగా ఉందని కప్పను ఆహారంగా వేస్తే ఆరగించిందని ఫణీంద్ర తెలిపారు. సర్పరక్షకుడు వారాది ఈశ్వరరావు శుక్రవారం రాజమహేంద్రవరం నగర శివార్లలో అటవీ ప్రాంతంలో దీన్ని విడిచిపెట్టారు. 

మరోవైపు, పాము కాటుతో చనిపోయేవారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతోంది. ఈ నెల మొదట్లో తెలంగాణలోని mahabubabad జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇకే ఇంట్లో ముగ్గురిని పాము కాటేసింది. మహబూబాబాద్‌ మండలం శనిగరపురంలో ఒకే ఇంట్లో ముగ్గురు snake biteకు గురయ్యారు. తల్లిదండ్రులతో పాటు చిన్నారిని పాము కాటేసింది. నవంబర్ 7న జరిగిన ఈ ఘటనలో 3 నెలల చిన్నారి మృతిచెందింది. 

మానసిక స్థితి బాగోలేని వ్యక్తిని పాము కాటుతో చంపేశారు.. ఇన్సురెన్స్ డబ్బుల కోసం ఇంత నీచమా..?

చిన్నారి తల్లిదండ్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు.. శనిగపురానికి చెందిన మమత, క్రాంతి దంపతులకు 3 నెలల పాప ఉంది. ఆదివారం ఉదయం నిద్రలేచేసరికి పాప నోటి వెంట నురగ రావడం చూసిన తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పాప మృతి చెందినట్టుగా వైద్యులు నిర్దారించారు.

మరోవైపు పాపకు కప్పి ఉంచి దుప్పటి నుంచి పాము బయటపడింది. ఆస్పత్రికి వెళ్లిన కొద్దిసేపటికే మమత, క్రాంతి కూడా స్పృహ కోల్పోయారు. దీంతో వారిని కూడా పాము కాటేసిందని నిర్దారణకు వచ్చిన వైద్యులు.. అదే ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మూడు నెలల చిన్నారి పాము కాటుతో మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు ఈ విషయం తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

నల్గొండ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే..
దీనికి వారం రోజుల క్రితం నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారిని, ఆమె తల్లిని పాము కాటేసింది. చింతపల్లి మండలం ససర్లపల్లి గ్రామానికి చెందిన మహిన్, సాల్మా దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. అయితే ప్రతి రోజులాగే అక్టోబర్ 29వ తేదీ రాత్రి కూడా.. సాల్మా, తన చిన్న కూతురు మాలిక్ కౌసర్‌తో నేలపై నిద్రపోయింది. అయితే ఆ సమయంలో వారిద్దరిని పాటు కాటు వేసింది. 

సాల్మాకు మెలుకువ వచ్చేసరికి ఆమెకు పాము చుట్టుకుని ఉంది. దీంతో కంగారు పడిపోయిన సాల్మా పామును పక్కకు విసిరేసింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వారిని వెంటనే దేవరకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పాప మాలిక్ కౌసర్‌ను కూడా పాము కాటు వేసినట్లు తెలుసుకున్న కుటుంబ సబ్యులు చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ పాప మరణించింది. సాల్మా ప్రాణాలతో బతికి బయటపడింది.

click me!