టీడీపీలోకి జమ్మలమడుగు నేతలు.. రాష్ట్రాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత: చంద్రబాబు

By telugu teamFirst Published Nov 26, 2021, 8:34 PM IST
Highlights

జమ్మలమడుగు నేతలు టీడీపీలోకి చేరారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు సమక్షంలో జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, ఆయన కుమారుడు భూపేష్ రెడ్డిలు పార్టీ కండువా కప్పుకున్నారు. జమ్మలమడుగు టీడీపీ కంచుకోట అని తెలిపారు. అందరు పార్టీ కోసం పనిచేయాలని, ప్రజా సమస్యలపై పోరాడాలని చెప్పారు. పార్టీలో చేరిన భూపేష్ రెడ్డిని జమ్మలమడుగు ఇంచార్జీగా నియమించారు.

అమరావతి: కడప(Kadapa) జిల్లా జమ్మలమడుగు(Jammalamadugu) నేతలు టీడీపీ చీఫ్ చంద్రబాబు(Chandrababu Naidu) సమక్షంలో పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, ఆయన కుమారుడు భూపేష్ రెడ్డిలను పార్టీ కండువా కప్పి చంద్రబాబు ఆహ్వానించారు. మంచి నేపథ్యం ఉన్నవారు పార్టీలోకి రావడం సంతోషంగా ఉన్నదని చంద్రబాబు అన్నారు. కాగా, చంద్రబాబు సారథ్యంలో పని చేసే అవకాశం రావడంపై కొత్తగా చేరిన నేతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌పై విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని వివరించారు.

మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డికి నారాయణ రెడ్డి సోదరుడు. నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్ రెడ్డిలు టీడీపీల్ చేరారు. జమ్మలమడుగు టీడీపీ కంచుకోట అని చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీల చేరిన భూపేష్ రెడ్డి యువకుడు అని, ఆయన రాజకీయ భవిష్యత్తు చాలా ఉన్నదని వివరించారు. వారు పార్టీలో చేరిన వెంటనే చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జమ్మలమడుగు పార్టీ ఇంచార్జీగా భూపేష్‌ రెడ్డిని నియమించారు. జమ్మలమడుగులో పార్టీ కోసం పనిచేస్తున్న అందరికీ గుర్తింపు ఉంటుందని చెప్పారు. అందరూ పార్టీ కోసం పని చేయాలని, ప్రజల సమస్యలపై పోరాడాలని అన్నారు.

Also Read: Nara Bhuvaneswari: అసెంబ్లీలో అవమానంపై ఏపి ప్రజలకు బహిరంగ లేఖ

ఇదే సమావేశంలో చంద్రబాబు నాయుడు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. సీఎం జగన్ అన్ని గాలి మాటలు మాట్లాడుతున్నారని వివరించారు. ఆయన గాల్లో వచ్చారని, గాల్లోనే పోతారని చెప్పారు. ఇలాంటి వారు ఉంటారనే ఆనాడు బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. సినిమా టికెట్లు ఆన్‌లైన్‌లో పెట్టి అప్పు తెచ్చుకుంటారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్వహణలో ఆయన విఫలమయ్యాడని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను విక్రయించడమో లేదా తనఖా పెట్టడమో చేస్తున్నాడని ఆరోపణలు చేశారు. జగన్ మోహన్ రెడ్డికి అనుభవం లేదని, కేవలం అహంభావం మాత్రమే ఉన్నదని విమర్శలు చేశారు. 

టీడీపీ వదిలి బయట బాట పట్టిన వారిని ఉద్దేశిస్తూ చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పార్టీ వీడిన వారు మళ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో చేరడానికి ఉవ్విళ్లూరుతుంటారని, కానీ, అలాంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వబోనని అన్నారు. కాగా, ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారో తాను గమనిస్తున్నానని, పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారనేది.. ఎవరు పనిచేయడం లేదనేది తాను రాసి పెట్టుకుంటున్నారని చెప్పారు. పార్టీ కోసం పని చేసిన వారికే పార్టీ పదవులు ఉంటాయని స్పష్టం చేశారు. వలస పక్షులకు పార్టీ పదవులు ఉండబోవని తేల్చి చెప్పారు. గతంలోనూ ఇలాంటివి అమలు చేసినప్పటికీ కచ్చితంగా అమలు చేయలేదని అన్నారు. ఇకపై నిబంధనలను కచ్చితత్వంతో అమలు చేస్తానని తెలిపారు.

click me!