ఏపీ అసెంబ్లీలో గందరగోళం: 10 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

By narsimha lode  |  First Published Mar 24, 2023, 9:35 AM IST

ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ నుండి  10 మంది టీడీపీ ఎమ్మెల్యేలను  సస్పెండ్  చేశారు.



అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి  ఒక్క రోజు పాటు  టీడీపీ  ఎమ్మెల్యేలను  శుక్రవారంనాడు  అసెంబ్లీ స్పీకర్  తమ్మినేని సీతారాం  సస్పెండ్  చేశారు. అసెంబ్లీ ప్రారంభమైన  వెంటనే  సభలో  టీడీపీ సభ్యులు  నిరసనకు దిగారు. తమ  పార్టీ ఎమ్మెల్యేలపై  దాడికి దిగిన వారిపై  చర్యలకు డిమాండ్  చేశారు. జీవో నెంబర్  1ని రద్దు  చేయాలని  కోరారు.ఈ విషయమై అసెంబ్లీ వెల్ లో కి వెళ్లి  టీడీపీ సభ్యులు  నిరసనకు దిగారు.  అసెంబ్లీ వెల్ లో రెడ్ లైన్ దాటడంతో   10 మంది టీడీపీ ఎమ్మెల్యేలను  సస్పెండ్  చేస్తున్నట్టుగా  ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం  ప్రకటించారు. స్పీకర్ రూలింగ్ కు  వ్యతిరేకంగా అసెంబ్లీలో  రెడ్ లైన్ దాటిన  టీడీపీ ఎమ్మెల్యేలపై  ఆటోమెటిక్ గా  సస్పెన్షన్  వర్తించిందని స్పీకర్ తమ్మినేని సీతారాం  చెప్పారు.  

అసెంబ్లీలో  ప్రశ్నోత్తరాలు  ప్రారంభానికి ముందు  టీడీపీ ఎమ్మెల్యేలు  అసెంబ్లీ నిరసనకు దిగారు. టీడీపీ సభ్యుల  నిరసనల మధ్యే  ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ఈ సమయంలో  సభలో గందరగోళ  వాతావరణం నెలకొంది.  

Latest Videos

undefined

దీంతో  10 మంది టీడీపీ ఎమ్మెల్యేలను  సభ నుండి  సస్పెండ్  చేస్తున్నట్టుగా  స్పీకర్ తమ్మినేని సీతారాం  ప్రకటించారు.  సస్పెన్షన్ కు గురైన టీడీపీ ఎమ్మెల్యేలు  సభ నుండి వెళ్లిపోవాలని స్పీకర్ఆదేశించారు.

ఈ అసెంబ్లీ సమావేశాల సెషన్ లో  టీడీపీ సభ్యులు  ప్రతి రోజూ సస్పెన్షన్ కు గురౌతున్నారు.  సమావేశాల  ప్రారంభం  రోజున, నిన్న  మినహాయించి   ప్రతి రోజూ  సభ నుండి టీడీపీ ఎమ్మెల్యేలు  సస్పెన్షన్ కు గురయ్యారు. 

also read:సీడబ్ల్యూసీ గైడ్‌లైన్స్ మేరకే నిర్మాణం: పోలవరం ఎత్తుపై ఏపీ అసెంబ్లీలో జగన్

అసెంబ్లీలో  ఏదో ఒక  అంశంపై  టీడీపీ సభ్యులు  నిరసనలకు దిగుతున్నారు.  ఈ విషయమై  సభలో  గందరగోళ  పరిస్థితులు నెలకొనడంతో   స్పీకర్  టీడీపీ ఎమ్మెల్యేలను  సస్పెండ్  చేస్తున్నారు.టీడీపీకి  చెందిన పయ్యావుల కేశవ్,  నిమ్మల రామానాయుడులను  ఈ అసెంబ్లీ సెషన్ పూర్తయ్యే వరకు  సస్పెండ్  చేశారు. 

click me!