పవన్ సభలో అపశృతి: కుప్పకూలిన పురాతన భవనం

By narsimha lodeFirst Published Oct 15, 2018, 7:03 PM IST
Highlights

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  సోమవారం నాడు రాజమండ్రిలో నిర్వహించిన సభలో  అపశృతి చోటు చేసుకొంది.


రాజమండ్రి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  సోమవారం నాడు రాజమండ్రిలో నిర్వహించిన సభలో  అపశృతి చోటు చేసుకొంది. వేదికకు సమీపంలోనే  ఉన్న  పురాతన భవనం పైకి పెద్ద సంఖ్యలో  పవన్‌కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఎక్కారు. దీంతో ఈ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో పదిమందికి గాయాలైనట్టు సమాచారం. 

పురాతన  భవనం కావడంతో  ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో సుమారు 10 మందికి గాయాలైనట్టు సమాచారం. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పురాతన భవనం కావడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకొందని చెబుతున్నారు. 

జనసేన కవాతు ముగింపు సందర్భంగా సర్ ఆర్ధర్ కాటన్ విగ్రహం సమీపంలో సభను నిర్వహించారు.  సోమవారం నాడు  పోలీసులు జనసేన కవాతుకు, సభకు అనుమతిని నిరాకరించారు.

ధవళేశ్వరం బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రావడంతో  ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని భావించి అనుమతిని నిరాకరించారు. పోలీసుల సూచన మేరకు పవన్ కళ్యాణ్ కారులోనే సభస్థలికి వచ్చారు.

సంబంధిత వార్తలు

చంద్రబాబు క్లీన్‌గా బయటకు రావాలి: పవన్‌కళ్యాణ్

ధవళేశ్వరం బ్రిడ్జిపై పవన్: కవాతులో కదం తొక్కిన జనసైనికులు

పవన్ కళ్యాణ్‌కు షాక్: ధవళేశ్వరం బ్రిడ్జిపై కవాతుకు అనుమతి నిరాకరణ

కవాతులో పాల్గొండి.. మీ కుటుంసభ్యులను గుర్తుపెట్టుకోండి: పవన్ ట్వీట్

click me!