
ఔషధ విలువలు కలిగిన మొక్కలను ఔషధ మొక్కలు (Medicinal Plants) అంటారు. వీటిని ఔషధాలను తయారుచేయటంలో ఉపయోగిస్తారు. ఈ మొక్కలలో అనేకం మనం ఇంటిలోనే పెంచవచ్చు. ఉధాహరణకు తులసి, జిల్లేడు, నాగజెముడు, కలబంద వంటి మొక్కలు.
ప్రస్తుత కాలంలో అందరూ అధునాతన మందులను ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదం గురించి దాదాపుగా మరిచిపోతున్నారు. కానీ ఆయుర్వేదంలో కొన్ని ఔషధ మొక్కలు, మూలికలు ఉన్నాయి. ఇవి చాలా రకాల ఆరోగ్య సమస్యలను సమర్థవంతంగా చికిత్స చేసి నయం చేయగలవు. ఈ ఔషధ మొక్కలు ప్రాచీన కాలం నుండి మన జీవితంలో ఒక భాగమై వివిధ ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాము. ఔషధ విలువలు కలిగిన పసుపు, అల్లం, తులసి ఆకులు, పుదీనా, దాల్చినచెక్క వంటి మూలికలను సాధారణంగా భారతీయ వంటకాలలో ఉపయోగిస్తారు. ఇవి అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయటంలో సహాయపడతాయి. ఇవి జలుబు, ఫ్లూ, ఒత్తిడిని నిరోధించటం, జీర్ణక్రియను మెరుగుపరచటం, రోగనిరోధక శక్తిని పెంచటం వంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఔషధ విలువలు కలిగిన కొన్ని మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1.కలబంద:
కొన్ని ప్రాంతాలలో దీనిని "కూటి కలబంద" అని అంటారు. దీని శాస్త్రీయ నామం అలోవిరా .కలబంద మొక్కను పెంచటానికి ఎక్కువ నీటి అవసరం వుండదు. అందుకే ఇవి పొడి పరిస్థితులలో కూడా పెరుగుతాయి. మీ ఇంటి పెరటులో చాలా సులభంగా ఎటువంటి అదనపు జాగ్రత్తలు అవసరం లేకుండా వీటిని పెంచవచ్చు.కలబంద వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.కలబంద మలబద్దకాన్ని నిర్మూలించటం,వ్యాధి నిరోధక శక్తిని మెరుగు పరచటం,జీర్ణ క్రియను వృధ్ధి చేయటంలో దోహద పడుతుంది.
2.తులసి
తులసి మొక్క హిందూ మతంలో చాలా ప్రాముఖ్యతను కలిగివుంది.దీనిని సర్వ రోగ నివారిణిగా భావిస్తారు. తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది.అంతే కాకుండా తులసి దగ్గు, గుండె జబ్బులు,మధుమేహం.జుట్టు రాలటం వంటి సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది.
3. పుదీనా
ఈ తాజా వాసన గల ఔషధ మొక్కను అనేక విధాలుగా ఉపయోగిస్తారు. మీ మానసిక స్థితిని మెరుగుపరచటం నుండి అజీర్ణ చికిత్స వరకు పుదీనా ఉపయోగపడుతుంది.ఈ మొక్క పెరగడానికి చాలా నీరు అవసరం.అందుకని పుదీనా విత్తనాలను నాటిన తరువాత విరివిగా నీటిని అందించాల్సి వుంటుంది.పుదీనా చాలా ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచటంలో, రోగనిరోధక శక్తిని పెంచటంలో ఉపయోగపడుతుంది.పుదీనా శ్వాసకోశ సంబంధిత వ్యాధులను కూడా నయం చేయటంలో సహాయపడుతుంది.
4. కొత్తిమీర
కొత్తిమీరను భారతీయ వంటలలో ఎక్కువుగా వాడుతుంటారు. కొత్తిమీర ఆకులు, దనియాలు,దనియాల పొడి ఇవన్నీ కూడా మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి మీ వంటలకు రుచిని పెంచటంతో పాటు వివిధ రకాల ఔషధ విలువలను జతచేస్తాయి.కొత్తిమీర మిమ్మల్ని ఆరోగ్యంగా ఎలా ఉంచుతుందంటే, ఇది ఆహారం త్వరగా పాడవకుండా కాపాడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లలో సమృద్ధిగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరుచటంలో కొత్తిమీర దోహదపడుతుంది.
5.అల్లం
అనేక రకాల ఆరోగ్య సమస్యలకు అల్లం ఒక పరిష్కారం. మీ ఇంటి పెరటులో అల్లం ను చాలా సులభంగా పెంచవచ్చు. దీనికి పెంచటానికి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం లేదు.విలక్షణమైన రుచి కారణంగా ఇది భారతీయ ఆహారంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అల్లం మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలిగిస్తుంది.ఇది తలనొప్పి, రక్తపోటును నియంత్రించటంతో పాటు జలుబు, దగ్గు, ఫ్లూ ను నయం చేయటంలో సహకరిస్తుంది.
6.అశ్వగంధ
అశ్వగంధ ఆయుర్వేద వైద్యంలో చాలా ముఖ్యమైనది. ఇది కేవలం 35-75 సెంటీమీటర్ల ఎత్తులో అంటే, 1.25 మీటర్ల ఎత్తులో గుబురుగా పొదలా పెరిగే మొక్క. అశ్వగంధ మొక్క వేళ్ళు పొడవుగా, ఉండి చాలా ఔషధగుణాలు కలిగివుంటాయి. ఇది సాధారణంగా సమశీతోష్ణ ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది. , ఉదరసంబంధవ్యాధులకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది., అశ్వగంధ జ్ఞాపక శక్తిని అత్యంత వేగంగా పెంచే ఔషధంగాను, ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, కేన్సర్ కు దీనిని మించిన ఔషధం మరొకటి లేదంటే, ఆశ్చర్యపడనక్కర్లేదు. ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కుంటున్న ఒత్తిడిని నివా రించడంలో దీనికిదే సాటి. నీరసాన్ని, నిస్త్రా ణని దగ్గరకి రానివ్వదు.
7.మెంతులు
మెంతులలో చాలా ఔషధ గుణాలు వుంటాయి. మెంతి మొక్క సతత హరిత మొక్క. తాజా మెంతికూర, ఎండబెట్టిన మెంతికూరను వైద్యపరమైన అవసరాల కోసం ఉపయోగిస్తారు. మెంతులను మసాలా దినుసుగా వాడతారు. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిచటంలో, జుట్టు రాలడాన్ని తగ్గించటంలో, ఆకలిని పెంచుటంటో మెంతులు సహాయపడతాయి. బ్లడ్ షుగర్ తో బాధపడేవారు మెంతులను ఆహారంగా తీసుకొంటే.. రక్తంలో ఇన్సులిన్ స్థాయులు తగ్గుముఖం పడతాయి. ఫలితంగా మధుమేహం అదుపులోకి వస్తుంది.
8.స్టీవియా
స్టీవియా తులసి జాతికి చెందిన మొక్క.వీటి ఆకులో అనేక ఔషధ గుణాలు ఉండటంతో పాటు పంచదార కంటే 30 రెట్లు ఎక్కువ తీపిగా ఉంటాయి. అంటే ఒక కప్పు పంచదార స్టీవియా ఆకులతో తీసిన ఒక స్పూన్ రసానికి సమానం.స్టీవియా ఆకులను వాడటం వలన అధిక రక్తపోటును అదుపులో ఉంచవచ్చు.ఇది జీర్ణశక్తిని పెంచి కడుపులో మంట,గ్యాస్ వంటి వాటిని తగ్గిస్తుంది. ఈ ఆకులు నమలటం వలన నోటి దుర్వాసన పోయి దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.మధుమేహం ఉన్నవారికి ఇది చక్కని ఔషధంలా పనిచేస్తుంది.
9.లావెండర్
లావెండర్ మొక్క చిన్న పొదలాగా పెరిగే మొక్క. ఈ మొక్కకి అందమైన పర్పుల్ బ్లూ పూలు పూస్తాయి. లావెండరు తైలాన్ని ఆరబెట్టిన పూలనుండి, పూలకంకిల నుండి ఉత్పత్తి చేస్తారు. లావెండర్ నూనె సుగంధ తైలం మాత్రమే కాదు దీనిలో ఉన్న ఔషద గుణాల కారణంగా వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. ఈ నూనె యాంటిసెప్టిక్ గా ,భాదనాశక ఔషధముగా ,మూర్ఛ నివారణ ఔషధముగా పనిచేస్తుంది.లావెండర్ నూనె కీలవాతం,అధిక రక్తపోటు ఉన్నవారు కూడా ఉపయోగిస్తారు. అంతే కాకుండా లావెండర్ నూనెను సబ్బుల తయారీలో ,చర్మం కోసం వాడే ఔషధ మందులో ఉపయోగిస్తారు.