organic farming: సేంద్రీయ వ్యవసాయంతో లాభాలెన్నో..

By Mahesh RajamoniFirst Published Feb 25, 2022, 4:44 PM IST
Highlights

benefits of organic farming: సేంద్రీయ వ్యవసాయంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అంతేకాదు ఈ వ్యవసాయం ద్వారా ఈ భూమ్మీదున్న ఎన్నో జీవులు అర్థాంతరంగా చనిపోయే పరిస్థితి ఏర్పడదు..
 

benefits of organic farming: సహజ వనరులను ఉపయోగించి వ్యవసాయం చేసే పద్దతినే సేంద్రీయ వ్యవసాయం అంటారు. ఈ సేంద్రీయ వ్యవసాయంలో ఎలాంటి రసాయనిక ఎరువులను గానీ, పురుగు మందులను గానీ ఉపయోగించకూడదు. ఈ పద్దతి ప్రకారం వ్యవసాయం చేయడం కాస్త కష్టతరమైనప్పటికీ.. దీని వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. 

సేంద్రీయ వ్యవసాయం ద్వారా భూసారం మరింత పెరుగుతుంది. పంటలు కలుషితం కావు.  అందుకే ప్రభుత్వాలు కూడా ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయి. తాజా పరిశోధనల ప్రకారం.. సేంద్రీయ పద్దతిలో పండించిన కూరగాయలు, పండ్లల్లో 40 శాతం ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని వెల్లడైంది. 

Latest Videos

ముఖ్యంగా సేంద్రీయ పద్దతుల ద్వారా పండించిన ఆహారం తీసుకోవడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, హై బ్లడ్ షుగర్ తగ్గుతుందని పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఈ ఆర్గానికి ఫుడ్స్ లో కెమికల్స్ ఏ మాత్రం ఉండవు. ఇలాంటి ఆహారంలో న్యూట్రిషియన్స్ అధిక మొత్తంలో ఉంటాయి. ఈ ఆర్గానిక్ ఫుడ్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే..

సేంద్రీయ ఎరువులతో పండించిన ఆహారాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. అంతేకాదు ఈ ఆహారం ఎన్నో పోషకవిలువలను కలిగి ఉంటుంది. అలాగే న్యూట్రీషియన్స్ కూడా అధికంగా ఉంటాయి. ఆర్గానిక్ వ్యవసాయం వల్ల వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఈ వ్యవసాయంలో శారీరక శ్రమ కూడా తక్కువగానే ఉంటుంది.

సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల  ప్రకృతికి మేలే కానీ నష్టం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఆర్గానిక్ వ్యవసాయానికి మన దేశంలో ఉన్న భూములన్నీ అనుకూలిస్తాయి. ఈ భూముల్లోనే పండుతయి.. ఈ భూముల్లో పండవు అనే సమస్యే ఉండదు. 

సేంద్రీయ పద్దతిలో పంటలను పండించేటప్పుడు ఒకే సారి కాకుండా.. క్రమ క్రమంగా పెంచుకుంటూ పోవాలి. ఒకే సారి ఈ పంటను పెద్దమొత్తంలో పండించలేరు. ఆర్గానిక్ ఫార్మింగ్ లో దిగుబడిలో ఎలాంటి మార్పులు రావు.

మొదటి సారి సేంద్రీయ వ్యవసాయం చేసేవారు .. పంటలకు 60 శాతం ఆర్గానిక్ పురుగుమందులకు 40 శాతం రసాయన పురుగు మందులను వాడాలి. అయితే ఇది వరకు వాడిన రసాయనిక పురుగుల మందు ప్రభావం పొలంలో తగ్గాలంటే .. ఆర్గానిక్ మందులను ఉపయోగించాలి. 


 

click me!