Today Top Stories: సీఎం సెక్యూరిటీ చేంజ్.. జనసేనకే గాజు గ్లాసు గుర్తు.. ఉప్పల్ స్టేడియంలో నేడే తొలి టెస్ట్..

Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో కాంగ్రెస్‌ది కుట్ర .. అప్పుడు బాబాయ్, ఇప్పుడు సోదరి.. నా కుటుంబాన్ని చీల్చి రాజకీయాలు : జగన్ సంచలన వ్యాఖ్యలు, గాంధీ వల్ల స్వతంత్రం రాలేదు - తమిళనాడు గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు, మరోసారి ఐఏఎస్‌ అధికారుల బదిలీలు..క్రికెట్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.. మెహదీపట్నం స్కైవాక్‌కు లైన్‌ క్లియర్‌ .. , జనసేనలోకి పృధ్వీరాజ్, జానీ మాస్టర్, జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు: ఈసీ స్పష్టీకరణ, బీజేపీ తో టీడీపీ, వైసీపీ కుమ్మక్కు - వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు,నేడే హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ .. వంటి వార్తల సమాహారం. 

today top stories top 10 Telugu news Andhra Pradesh Telangana headlines krj

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Today's Top Stories: సీఎం సెక్యూరిటీ చేంజ్.

CM Convoy: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే సచివాలయంలో కొత్త కాన్వాయ్‌ను అధికారులు సిద్ధం చేశారు. అప్పటి వరకు సీఎంకు నలుపు రంగు కార్లతో కాన్వాయ్ ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి కోసం అన్ని తెలుపు రంగు కార్లతో కాన్వాయ్ సిద్ధం చేశారు. కానీ, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ మళ్లీ నలుపు రంగు కార్లతో నిండింది. అదీ ల్యాండ్ క్రూయిజర్ కార్లతో సీఎం కాన్వాయ్ ఉండటం గమనార్హం. ఈ ల్యాండ్ క్రూయిజర్లు అన్నీ కూడా కేసీఆర్ హయాంలో కొనుగోలు చేసినవే.

"ఒక్కసారి కాదు.. సీఎంను 100 సార్లు కలుస్తాం"

BRS MLAs: ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఇలా నలుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి రేవంత్ రెడ్డిని కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది. వారందరూ కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారం జోరందుకుంది. తాము మర్యాదపూర్వకంగానే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామంటూ ..ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చినా.. ప్రచారానికి బ్రేకులు వేయలేకపోయారు. దీంతో ఆ నలుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

క్రికెట్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.. 

TSRTC: క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది. నేటీ నుండి హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య ఉత్కంఠభరితమైన టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ వీక్షించేందుకు వెళ్తున్న క్రికెట్‌ అభిమానులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) గుడ్‌న్యూస్‌ చెప్పింది.  ఈ మ్యాచ్ చూసేందుకు వెళ్తున్న క్రికెట్ అభిమానుల రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాటు చేసింది.

మెహదీపట్నం స్కైవాక్‌కు లైన్‌ క్లియర్‌ ..

Mehdipatnam Sky Walk: మెహదీపట్నంలో నిర్మిస్తున్న స్కైవాక్‌ కు లైన్ క్లియర్ అయ్యింది. పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 3380 చదరపు గజాల రక్షణ భూమిని అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. తాజా డిజైన్‌కు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. స్కైవాక్‌ను అభివృద్ధి చేయడానికి అవసరమైన భూమిపై కేంద్రంతో ఒప్పందం కుదిరిన తర్వాత.. మెహదీపట్నం ప్రాంతంలో పాదచారుల రాకపోకలను సులభతరం చేసే ఈ ప్రాజెక్టు పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

మరోసారి ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ జరిగిన బదిలీలల్లో కొందరికీ ప్రమోషన్.. మరికొందరికీ డిమోషన్ జరిగినట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరికొంతమంది అధికారుల బదిలీలు జరిగే అవకాశం లేకపోలేదు.  తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగజావుగా జరిగేందుకు పలు కీలక చర్యలు తీసుకుంటున్నారు సీఎం  రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ఫలితాలు ప్రజలకు చేరేలా  అధికారులను బదిలీ చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసినా రాష్ట్రప్రభుత్వం తాజాగా మరోసారి ఐఏఎస్ ల బదిలీ చేపట్టింది. ఈ సారి ఆరుగురు ఐఏఎస్ లను బదిలీ చేసింది. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల పోస్టింగ్‌లు, బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఆమోదముద్ర వేసింది.

ఏసీబీ వలలో మరో భారీ అవినీతి తిమింగలం..  ఇప్పటివరకు రూ.100 కోట్లు గుర్తింపు.
 
HYDERABAD: అవినీతి నిరోధకశాఖ వలలో మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. హైదరాబాద్ లోని హెచ్‌ఎండీఏ పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ శివబాలకృష్ణ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. ఆయన నుంచి ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా స్థిర, చరాస్తులు గుర్తించారు. ఇంకా పలు బ్యాంకుల్లో ఉన్న లాకర్లు తెరవాల్సి ఉంది.

కాంగ్రెస్‌ది కుట్ర : జగన్ సంచలన వ్యాఖ్యలు

తిరుపతిలో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జాతీయ పార్టీలకు స్థానం లేదని.. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే అరెస్ట్ అయ్యారని పేర్కొన్నారు. తన కుటుంబాన్ని విభజించి పాలించాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, చంద్రబాబు అవినీతిపై ఆధారాలతోనే కేసులు నమోదు చేసినట్లు జగన్ తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ చెత్త రాజకీయం చేస్తోందని, గతంలోనూ మా బాబాయ్‌ని మంత్రిని చేసి మాకు వ్యతిరేకంగా నిలబెట్టిందని ఆయన మండిపడ్డారు. 

జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు: ఈసీ స్పష్టీకరణ

జనసేన పార్టీ గాజు గ్లాస్ ను కేటాయిస్తూ  కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు  జనసేనకు  కేంద్ర ఎన్నికల సంఘం  మెయిల్ ద్వారా సమాచారం పంపింది. జనసేన పార్టీకి ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ ను  ఉచిత చిహ్నాల జాబితాలో ఈ ఏడాది మే మాసంలో ఉంచింది  కేంద్ర ఎన్నికల సంఘం.  ఈ విషయమై  జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి గాజు గ్లాసును కేటాయించాలని  అభ్యర్ధించింది. దీంతో జనసేనకు గాజు గ్లాసును కేటాయిస్తున్నట్టుగా ఈసీ  జనసేనకు మెయిల్ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం  పంపిన ఉత్తర్వు కాపీలను పార్టీ లీగల్ సెల్  సాంబశివప్రతాప్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అందించారు.

జనసేనలోకి పృధ్వీరాజ్, జానీ మాస్టర్ 

Pawan Kalyan: ‘థర్టీ ఇయర్ ఇండస్ట్రీ’ డైలాగ్ ఫేమ్ యాక్టర్ పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా పార్టీ కండువా కప్పి పృధ్వీరాజ్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం పృధ్వీరాజ్‌ను సాదరంగా ఆహ్వానించారు. పృధ్వీరాజ్‌తోపాటు జానీ మాస్టర్ కూడా ఈ రోజు జనసేన పార్టీలో చేరారు. కొన్నాళ్లుగా ప్రజా సమస్యలపై స్వయంగా క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తున్న జానీ మాస్టర్ దాదాపు పొలిటికల్ ఎంట్రీ చాన్నాళ్ల క్రితమే ఇచ్చారు. తాజాగా జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆయను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బీజేపీ తో టీడీపీ, వైసీపీ కుమ్మక్కు - వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

కేంద్రంలోని అధికార బీజేపీతో తెలుగుదేశం పార్టీ, వైసీపీలు కుమ్మకు అయ్యాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పారు. విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. టీడీపీ చీఫ్ చంద్రబాబువి కనిపించే పొత్తులని, వైసీపీవి కనిపించని పొత్తులని ఎద్దేవా చేశారు. తనకు ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని వైఎస్ జగన్ అన్నారని, కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని మర్చిపోయారని తెలిపారు. 

గాంధీ వల్ల స్వతంత్రం రాలేదు - తమిళనాడు గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు

గాంధీ వల్ల భారతదేశానికి  స్వాతంత్ర్యం రాలేదని (India did not get independence because of Gandhi) తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (Tamil Nadu Governor RN Ravi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ( Netaji Subhas Chandra Bose) పోరాటం వల్ల బ్రిటిషర్లు మన దేశం వదలి వెళ్లిపోయారని చెప్పారు.

ఢిల్లీ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపులు..

Delhi Airport News: దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో ఒకటైన ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ఐజీఐ ఎయిర్‌పోర్ట్)లో ఒక విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపుల కాల్ వచ్చింది. దర్భంగా నుంచి ఢిల్లీకి వస్తున్న స్పైస్ జెట్ విమానంలో బాంబు ఉందని కాల్ చేసిన వ్యక్తి చెప్పినట్లు సమాచారం. అయితే పోలీసులు విచారించగా అది బూటకపు కాల్ అని తేలింది. ఎయిర్‌పోర్ట్ పోలీసులు కాలర్‌ను ట్రేస్ చేస్తున్నారు. 

ఉప్పల్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ 

హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో  ఈ నెల  25వ తేదీన ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్  కోసం అభిమానులు  ఎదురు చూస్తున్నారు. ఈ నెల  25న ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్  జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. 2010 నుండి 2018 వరకు  మొత్తం ఐదు టెస్టు మ్యాచ్ లకు  హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియం  ఆతిథ్యం ఇచ్చింది.  అస్ట్రేలియా, బంగ్లాదేశ్ లతో  ఒక్కో న్యూజిలాండ్, వెస్టీండీస్ జట్లతో   ఈ స్టేడియంలో ఐదు టెస్టు మ్యాచ్ లు జరిగాయి. ఐదు మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ డ్రాగా ముగిసింది. మిగిలిన నాలుగు మ్యాచ్ లలో  భారత జట్టు విజయం సాధించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios