ఈ నెల ప్రారంభంలో అమెరికాలో పిడుగుపాటుకు గురై ప్రాణాలతో పోరాడుతున్న 25 ఏళ్ల భారత సంతతి విద్యార్థిని కోలుకుంటోంది. ఇంత కాలం వెంటిలేటర్ పై ఉన్న ఆమె.. వారం రోజుల నుంచి సొంతంగా శ్వాస తీసుకుంటోందని డాక్టర్లు తెలిపారు. హ్యూస్టన్ యూనివర్శిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుతున్న భారతీయ విద్యార్థిని సుశ్రూణ్య కోడూరు జూలై 2వ తేదీన శాన్ జెసింటో స్మారక పార్కు వద్ద స్నేహితులతో కలిసి చెరువు వెంట నడుచుకుంటూ వెళ్తుండగా పిడుగు పడింది.

మణిపూర్ లో కొనసాగుతున్న హింసాకాండ.. మరో నలుగురు పోలీసులను గాయపర్చిన దుండగులు

దీంతో వెంటనే ఆమె చెరువులో పడిపోయింది. తరువాత సుశ్రూణ్య గుండె లయ తప్పింది. తరువాత ఆమెను స్నేహితులు హాస్పిటల్ కు తరలించారు. డాక్టర్లు ఆమె కోమాలోకి వెళ్లిందని నిర్ధారించారు. దీంతో పాటు శ్వాస తీసుకోలేకపోవడం, మెదడు పనితీరు తిరిగి కూడా సరిగా లేకపోవడంతో పీఈజీ ట్యూబ్ సహాయంతో ట్రాకియోస్టోమీతో వెంటిలేటర్ పై ఉంచారు. ఆమె పిడుగుపాటుకు గురైందని హ్యూస్టన్ విశ్వవిద్యాలయం జూలై 26 న ట్వీట్ చేసింది.

సుశ్రూణ్య చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరం కావడంతో ఆమె కుటుంబ సభ్యులు ‘గోఫండ్‌మీ’ని ఆశ్రయించారు. ఆన్ లైన్ ద్వారా ఆమె ట్రీట్ మెంట్ కు అవసరమైన డబ్బులను దాతల నుంచి కోరారు. తమ బిడ్డ కోలుకోవడానికి అందరి సహాయం కావాలని కుటుంబ సభ్యులు అభ్యర్థించారు. 

సిరియాలో బాంబు పేలుడు.. ఆరుగురు మృతి, 23 మందికి గాయాలు

కాగా.. అమెరికా వెళ్లి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ చేసిన సుశ్రూణ్య కోడూరు.. పలు కోర్సులు పూర్తి చేసి ఇంటర్న్ షిప్ అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ఆమె తల్లిదండ్రులు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తునన్నారు. వారికి ఇటీవల వీసాలు మంజూరు అయ్యాయి. వచ్చే వారం వారు అమెరికాకు వెళ్లబోతున్నారు.

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చీఫ్ పదవీకాలాన్ని పొడిగించిన సుప్రీంకోర్టు.. ఎప్పటి వరకు అంటే ?

ఇదిలా ఉండగా..  గత 30 ఏళ్లలో సగటున ఏడాదికి 43 పిడుగుపాటు మరణాలు సంభవించాయని నేషనల్ వెదర్ సర్వీస్ పేర్కొంది. అయితే పిడుగుపాటుకు గురైన వారిలో పది శాతం మంది చనిపోతున్నారని, 90 శాతం మంది వివిధ స్థాయిల్లో అంగవైకల్యంతో బాధపడుతున్నారని తెలిపింది.