
వంటల్లో మనం ఎన్నో రకాల మసాలా దినుసులను ఉపయోగిస్తాం. ఇవి ఫుడ్ మంచి టేస్టీగా చేస్తాయి. ఇళాంటి మసాలా దినుసుల్లో జాపత్రి ఒకటి. ఇది చూడటానికి ఒక పువ్వులా కనిపిస్తుంది. ఈ జాపత్రి ఫుడ్ కు మంచి సువాసన, రుచిని ఇవ్వడమే కాకుండా.. ఆడవారి ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అవును జాపత్రి వల్ల ఆడవారు ఎన్నో సమస్యలకు దూరంగా ఉంటారు. అసలు జాపత్రి ఆడవారికి ఎలా ఉపయోగపడుతుందంటే?
చర్మానికి మంచిది : జాపత్రి ఆడవాళ్ల చర్మానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అవును జాపత్రిని ఉపయోగించి ఆడవారు ముఖంపై మచ్చలను, బ్లాక్ హెడ్స్ ను తొందరగా తగ్గించుకోవచ్చు.
కీళ్ల నొప్పులు: ఒకప్పుడు 40, 50 ఏండ్ల వారికే కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వచ్చేవి. కానీ ఇప్పుడు 25 ఏండ్ల వారికి కూడా కీళ్ల నొప్పులు వస్తున్నాయి. ఆడవారు ఈ జాపత్రిని ఉపయోగించి కీళ్ల నొప్పుల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబతున్నారు. మీ ఆహారంలో జాపత్రిని చేర్చుకుంటే కీళ్ల నొప్పులు, వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది.
జాపత్రిని ఎలా తీసుకోవాలి: 2 గ్రాముల జాపత్రిలో కొద్దిగా ఎండు అల్లాన్ని వేసి కలపండి. దీన్ని వేడి నీళ్లతో తీసుకోండి. ఇలా చేయడం వల్ల ఆడవాళ్లకు కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
కడుపు సమస్యల నుంచి ఉపశమనం: జాపత్రిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అజీర్ణం, అతిసారం,మలబద్ధకం, కడుపు నొప్పి వంటి కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఒత్తిడి నుంచి ఉపశమనం: ప్రస్తుత కాలంలో చాలా మంది ఆడవారు ఇంటిని, ఆఫీసును చూసుకోలేక బాగా ఒత్తిడికి గురవుతున్నారు. ఇలా ఒత్తిడికి గురయ్యే ఆడవారికి జాపత్రి ఎంతో మేలు చేస్తుంది. ఈ మసాలానుు తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ప్రశాంతంగా ఉంటారు.
బలహీనత: మీకు ఆకలి తక్కువగా అయితే.. జాపత్రిని ఖచ్చితంగా తినండి. అలాగే బలహీనంగా అనిపించినా కూడా మీరు ఆహారంలో జాపత్రిని చేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇది మీ ఆకలిని పెంచడానికి బాగా సహాయపడుతుంది.
కిడ్నీలో రాళ్లు: జాపత్రిలో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా కాపాడతాయి. ఒకవేళ కిడ్నీల్లో రాళ్లు ఉంటే కూడా వాటిని కరిగించడానికి , బయటకు పంపడానికి సహాయపడతాయి.