ముల్తానీ మట్టిని రోజూ ముఖానికి వాడితే ఏమౌతుందో తెలుసా?

By Shivaleela Rajamoni  |  First Published Jul 19, 2024, 2:52 PM IST

ముఖం అందంగా కనిపించేందుకు ఆడవాళ్లు ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. వీటిలో ముల్తానీ మట్టి ఒకటి. కానీ రోజూ ముఖానికి ముల్తానీ మట్టిని వాడితే ఏమౌతుందో తెలుసా? 
 


సాధారణంగా ఆడవాళ్లందరూ  అందరిలో అందంగా కనిపించాలనుకుంటారు. ఇందుకోసం మార్కెట్ లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. మరికొంతమంది సహజంగా అందంగా కనిపించడానికి ప్రయత్నంచేస్తారు. తమ ముఖం అందంగా, కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ మొటిమలు మరియు బ్లాక్ హెడ్స్ మరియు ముఖం మీద మచ్చల కారణంగా వారి అందం తగ్గిపోతుంది. దీని కోసం వారు చాలా ఖరీదైన వస్తువులను ఉపయోగిస్తారు. అంతే కాకుండా అప్పుడప్పుడు పార్లర్ కి వెళ్లి ఫేషియల్ చేయించుకుంటున్నారు.

అయితే బ్యూటీపార్లర్‌కు వెళ్లడానికి ఇష్టపడని మహిళలు తమ ఇంట్లో ఉండే ఉత్పత్తులతోనే అందాన్ని కాపాడుకుంటున్నారు. ముఖాన్ని అందంగా చేసే వాటిలో ముల్తానిమిటీ ఒకటి.  ఈ ముల్తానీ మట్టి ముఖాన్ని అందంగా కనిపించేలా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. నిజానికి ముల్తానీ మట్టి చాలా తక్కువ ధరకే స్టోర్లలో దొరుకుతుంది. కానీ దీనివల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ముఖం మీద మొటిమలను,  బ్లాక్ హెడ్స్ తొలగిస్తుంది. ముఖాన్ని ఎప్పుడూ అందంగా ఉంచడానికి సహాయపడుతుంది.

Latest Videos

అయితే ముఖానికి రోజూ ముల్తానీ మిట్టిని ఉపయోగించడం వల్ల ఎన్నో చర్మ సంబంధిత సమస్యలు వస్తాయన్న ముచ్చట మీకు తెలుసా? అలాగే ముల్తానీ మట్టిని ఉపయోగించడం వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తాయి. వాటి గురించి ఓ లుక్కేద్దాం పదండి. 

మీరు ముల్తానీ మట్టిని కొనేటప్పుడు మీ చర్మ రకాన్ని బట్టి ఎంచుకోండి. లేకపోతే మీ చర్మం వాపు, ఎరుపు, దద్దుర్లు వంటి సమస్యల బారిన పడుతుంది. అలాగే ముల్తానీ మట్టిని సరిగ్గా వాడకపోవడం వల్ల ముఖంపై మొటిమలు ఏర్పడి ముఖం అంద విహీనంగా కనిపిస్తుంది. కాబట్టి సరైన ముల్తానీ మట్టిని కొని సరైన పద్ధతిలో వాడండి.

పొడి చర్మం ఉన్నవారు ముల్తానీ మట్టిని ఉపయోగించకపోవడమే మంచిది. ఎందుకంటే ముల్తానీ మట్టి చర్మంలో ఉండే సహజ నూనెలను గ్రహిస్తుంది. మీరు దీన్ని ఉపయోగించాలనుకుంటే..ఎక్కువగా అస్సలు ఉపయోగించకూడదు. ముల్తానీ మట్టి కొందరికి అలర్జీని కూడా కలిగిస్తుంది. కాబట్టి మీరు ముల్తాని మటీని ఉపయోగించే ముందు, ప్యాచ్ టెస్ట్ చేసి  ఉపయోగించండి.

ముల్తానీ మట్టిని ఉపయోగించిన తర్వాత మీరు ఎండలోకి అస్సలు వెళ్లకూడదు. ఎందుకంటే ఇది  మీ చర్మంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అలాగే ముల్తానీ మట్టిని నేరుగా మీ చర్మానికి అప్లై చేయకండి. దీనికి బదులుగా మీరు మట్టితో పాటు రోజ్ వాటర్ లేదా పెరుగును ఉపయోగించొచ్చు.

ముల్తానీ మిట్టిని రోజూ వాడకూడదు. ఎందుకంటే ఇది మీ చర్మాన్ని పొడిబారేలా చేస్తుంది. రోజు రోజుకు మీ ముఖం గరుకుగా మారడం ప్రారంభమవుతుంది. అదేవిధంగా మీకు సున్నితమైన చర్మం ఉన్నట్టైతే మీరు ప్రతిరోజూ ముల్తానీ మట్టిని ఉపయోగించకుండా ఉండాలి. ఎందుకంటే ఇది మీ చర్మంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మీరు ముల్తానీ మట్టిని ఉపయోగించాలనుకుంటే వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఉపయోగించాలి.  తరచుగా ఉపయోగిస్తే చర్మం పొడిబారుతుంది.

click me!