Latest Videos

ఈ మహిళ తెలివికి ఎవరైనా దండం పెట్టాల్సిందే.. గ్యాస్ భలే సేవ్ చేసిందిగా..!

By Venugopal Bollampalli EditorFirst Published Mar 26, 2024, 9:31 AM IST
Highlights

ఇలాంటి ఐడియా రావడమే గ్రేట్ అని అందరూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారిన ఓ వీడియో వివరాలు ఇలా ఉన్నాయి.

వంట గ్యాస్ ధరలు రోజు రోజుకీ మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్క మధ్య తరగతి మహిళ.. ఎలా వంట గ్యాస్ సేవ్ చేయాలా అనే చూస్తూ ఉంటారు. కానీ... ప్రతిరోజూ మూడు పూటలా వంట చేయకతప్పదు. ఇక టీలు, కాఫీలు ఇక ఎన్నిసార్లు పెడతామో లెక్కపెట్టాల్సిన అవసరం లేదు. ఇన్నిసార్లు.. వంటలు చేస్తుంటే.. గ్యాస్  ఎక్కువ రోజులు రాదు. తొందరగానే అయిపోతుంది.

అయితే.. వంట గ్యాస్ సేవ్ చేయాలంటే ఎవరైనా ఈ మహిళను ఫాలో అవ్వాల్సిందే. ఆమె గ్యాస్  సేవ్ చేయడానికి చేసిన పనికి అందరూ జోహార్లు కొడుతున్నారు. అసలు.. ఇలాంటి ఐడియా రావడమే గ్రేట్ అని అందరూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారిన ఓ వీడియో వివరాలు ఇలా ఉన్నాయి.

ఒక మహిళ తన కుటుంబం కోసం పూరీ, అందులోని ఆలూ కర్రీ చేయాలని అనుకుంది. అయితే... బంగాళ దుంపులను ఒక గిన్నెలో ఉడకపెట్టింది. అయితే.. ఆ ఉడకపెట్టే సమయంలో.. ఆవిరి పైకి వస్తూ ఉంటుంది. ఆ ఆవిరికి ఆమె పూరీ చేసేసింది. నమ్మకసక్యం కాకపోయినా ఇది నిజం. బంగాళదుంపలు ఉడుకుతున్న గిన్నెపై మరో కడాయి పెట్టింది. దాంట్లో నూనె పోసింది. కింద బంగాళ దుంపలు ఉడుకుతున్న సమయంలో.. ఆవిరికి పైన కడాయిలో నూనె వేడెక్కింది. ఆ బంగాళ దుంపలు ఉడికే సమయంలో ఆమె పూరీ మొత్తం కాల్చేసింది. ప్రస్తుతం ఆ వీడియోని సదరు మహిళ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెట్టింట వైరల్ గా మారింది.

ఈ రకంగా కూడా గ్యాస్ సేవ్ చేయోచ్చా.. ఈ ఐడియా ఇంతకాలం మాకు రాలేదు అని కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఆ వీడియో పై ఓ లుక్ వేసేయండి..!

 

 

click me!