శిల్పా శెట్టి రెగ్యులర్ గా తాగే డ్రింక్ ఇది.. ఆమె బ్యూటీ సీక్రెట్ ఇదే..!

By ramya Sridhar  |  First Published Jul 2, 2024, 4:06 PM IST


శిల్పాశెట్టి.. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. తన ఫిట్నెస్ సీక్రెట్స్ ని ఆమె తన ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటారు.  తాజాగా.. తన ఫిట్నెస్ కి సంబంధించిన   ఓ చిట్కా ని పంచుకున్నారు. రెగ్యులర్ గా ఆమె దానిని తాగుతూ ఉంటారట. 
 


బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టికి పరిచయం అవసరం లేదు. ఆమె తెలుగు సినిమాల్లోనూ నటించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె వయసు 50 ఏళ్లు అయినా.. ఇప్పటికీ 20ఏళ్ల యువతిలా కనపడుతుంటారు.  ఆమె అంత యవ్వనంగా కనపడటానికి.. తన ఆహారం విషయంలో, ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆమె రెగ్యులర్ గా యోగా చేస్తూ ఉంటారు. వీటితో పాటు.. తన ఫిట్నెస్, అందాన్ని పెంచుకోవడానికి రెగ్యులర్ గా ఓ డ్రింక్ తాగుతూ ఉంటారట. ఆ డ్రింక్ ఏంటి..? దానిని తాగడం వల్ల కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం...


శిల్పాశెట్టి.. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. తన ఫిట్నెస్ సీక్రెట్స్ ని ఆమె తన ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటారు.  తాజాగా.. తన ఫిట్నెస్ కి సంబంధించిన   ఓ చిట్కా ని పంచుకున్నారు. రెగ్యులర్ గా ఆమె దానిని తాగుతూ ఉంటారట. 

Latest Videos

శిల్పా శెట్టి బ్యూటీ సీక్రెట్ హాట్ వాటర్. ప్రతి రోజూ ఉదయం ఆమె గోరు వెచ్చని నీరు తాగుతూ ఉంటారట. ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా ఆమె హాట్ వాటర్ తాగుతూ ఉంటారట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా  చెప్పడం విశేషం.  తన బాడీ హైడ్రేట్‌గా ఉండేలా షో రన్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడూ వేడి నీటిని పక్కనే ఉంచుకుంటానని శిల్పా వెల్లడించింది. వేడి నీరు డిటాక్స్ సహాయం, శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది. బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది అని ఆమె చెప్పారు. 

శిల్పా కూడా వేడి నీళ్లలో అల్లం కలిపి తాగుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, కడుపు నొప్పిని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శిల్పా  శెట్టి  తులసి నీళ్లు తాగుతూ ఉంటారట. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది . మెటబాలిజం, మెటబాలిజం స్థాయిని పెంచుతుంది. ఈ డ్రింక్స్ కారణంగానే ఆమె ఇప్పటికీ యవ్వనంగా కనపుడుతున్నాను అని చెప్పడం విశేషం.


శిల్పాశెట్టి రోజూ ఉదయం బొప్పాయి తింటుంది. ఉడికించిన గుడ్లు , గంజి, కూరగాయలు, చేపలు ఆమె ఆహారంలో చేర్చుకుంటారట. మధ్యాహ్న భోజనం తర్వాత జీర్ణక్రియకు సహాయపడటానికి శిల్పా బెల్లం ముక్కను తినడానికి ఇష్టపడుతుంది. సాయంత్రం వేళ ఆకలి వేస్తే రాత్రిపూట మజ్జిగ, సీజనల్ వెజిటబుల్ సలాడ్, సూప్ తింటూ ఉంటారట.

click me!