గోల్డెన్ గ్లోబ్స్: చీరకట్టులో మెరిసిన ఉపాసన..!

Published : Jan 11, 2023, 11:45 AM IST
గోల్డెన్ గ్లోబ్స్: చీరకట్టులో మెరిసిన ఉపాసన..!

సారాంశం

ప్రధాన నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, చిత్రనిర్మాత ఎస్ఎస్ రాజమౌళి కలిసి అవార్డుల వేడుకకు హాజరయ్యారు. వారి వారి భార్యలు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.  

ఆర్ఆర్ఆర్ కి ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. బుధవారం కాలిఫోర్నియాలో జరిగిన 80వ గోల్డెన్ గ్లోబ్స్‌లో RRR చలనచిత్రానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆ సినిమాలోని  అత్యంత ప్రజాదరణ పొందిన నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డును గెలుచుకుంది. ప్రధాన నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, చిత్రనిర్మాత ఎస్ఎస్ రాజమౌళి కలిసి అవార్డుల వేడుకకు హాజరయ్యారు. వారి వారి భార్యలు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

 


కాగా...ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ ఫోటోల్లో అందరికన్నా... రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె... సంప్రదాయ బద్దంగా చీరలో కనిపించడం విశేషం. చీర కట్టుకొని.. ముఖాన బొట్టుతో ఎంతో అందంగా కనిపించారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి సెల్ఫీ దిగగా.. ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో... ఈ ఫోటోలు ఇరు స్టార్ల అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.


ఆమె చీరకట్టులో దర్శనమివ్వడంతో...  ఆమె లుక్ కి అభిమానులు సైతం ఫిదా అయిపోయారు. చాలా అందంగా ఉన్నారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా.... రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే  తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

లైట్ వెయిట్ లో గోల్డ్ లాకెట్.. ట్రెండీ డిజైన్స్ ఇవిగో
ABC Juice: చలికాలంలో ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు.. ఒక్క వెంట్రుక కూడా రాలదు..!