పండగ వేళ... ఈ ఫేస్ మాస్క్ లతో మెరిసిపోండిలా...!

By telugu news teamFirst Published Sep 26, 2022, 3:08 PM IST
Highlights

అందరూ ఒకేలాంటి ఫేస్ మాస్క్ లు ఉపయోగించకూడదట. వారి చర్మం తీరును బట్టి ఉపయోగించాలట.  మరి ఎలాంటి చర్మంగలవారు ఎలాంటి ఫేస్ మాస్క్ లను ఉపయోగించి అందంగా మెరిసిపోవచ్చో ఓసారి చూద్దాం..

నవరాత్రి ఉత్సావాలు మొదలయ్యాయి. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే... ఈ పంగ వేళ.. ప్రతిరోజూ అందంగా మెరిసిపోవాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే... కొన్ని రకాల ఫేస్ మాస్క్ లతో.. అందంగా మెరిసిపోవచ్చని నిపుణులు చెముతున్నారు. అయితే... అందరూ ఒకేలాంటి ఫేస్ మాస్క్ లు ఉపయోగించకూడదట. వారి చర్మం తీరును బట్టి ఉపయోగించాలట.  మరి ఎలాంటి చర్మంగలవారు ఎలాంటి ఫేస్ మాస్క్ లను ఉపయోగించి అందంగా మెరిసిపోవచ్చో ఓసారి చూద్దాం..

పొడి చర్మం వారు తమ చర్మాన్ని  ప్రకాశవంతం చేయడానికి ఆపిల్ మాస్క్ ఉపయోగించండి. మొదట, ఆపిల్‌ను ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు బ్లెండ్ చేయండి. బ్లెండ్ చేసిన యాపిల్ ముక్కలను వడకట్టి రసాన్ని వేరు చేయండి. ఇప్పుడు దానితో విటమిన్ ఇ క్యాప్సూల్ కలపండి. బాగా మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. పూర్తిగా ఎండిపోయిన తర్వాత నీటితో కడగాలి.

నార్మల్ స్కిన్ టోన్ గలవారు మైదా,తేనె ఫేస్ మాస్క్ ఉపయోగించండి. ఒక గిన్నెలో కొంచెం పిండిని తీసుకుని అందులో తేనె  క్యామోలిన్ రసం కలపండి. బాగా కలపండి. దీనిని ఇప్పుడు ముఖానికి రాయాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత నీటితో కడిగేయాలి. అప్పుడు చర్మం అందంగా మారుతుంది. 

జిడ్డుగల చర్మంపై క్యారెట్ జ్యూస్ మాస్క్ ఉపయోగించండి. ముందుగా ఒక గిన్నెలో ముల్తానీ మట్టిని తీసుకోవాలి. దీనికి క్యారెట్ రసం కలపండి. విటమిన్ ఇ క్యాప్సూల్స్ వేసి బాగా కలపి.. ప్యాక్ చేయండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. క్యారెట్ రసంతో చేసిన మాస్క్ జిడ్డుగల చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
 

click me!