చాలా మంది ఆడవారికి ఈ డౌట్ ఖచ్చితంగా వస్తుంది. కొంతమంది అయితే ఏదైనా వ్యాధి ఉందేమో.. దానివల్లే ఇలా జరిగి ఉంటుందని వారికి వారే అనుకుంటుంటారు. కానీ దీనికి అసలు కారణాలేంటో తెలుసా?
కొంతమంది ఆడవాళ్ల రొమ్ములు ఒకే సైజులో ఉండవు. నిజానికి ఏ ఒక్క ఆడవారి బ్రెస్ట్ పరిమాణం ఒకే విధంగా ఉండదు. కానీ ఇది వారి శరీర ఆకారాన్ని ప్రభావితం చేస్తుంది. అందులోనూ రెండు రొమ్ములు ఒకే సైజులో లేవని బాధపడుతూ చెప్పేవారిని మీరు చూసే ఉంటారు. ఇదిపెద్ద రోగమా? చాలా మంది ఆడవారు భయపడి బాధపడుతుంటారు. కానీ ఇది సర్వ సాధారణమని నిపుణులు చెబుతున్నారు. మరి రెండు రొమ్ములు ఒకేసైజులో లేకపోవడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
హార్మోన్ల ప్రభావం: మన శరీరంలో హార్మోన్లు సక్రమంగా పనిచేసిన్నప్పుడే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఎదుగుదల కూడా ఉంటుంది. అయితే ఆడవాళ్ల వక్షోజాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు హార్మోన్ల మార్పులు వస్తే రొమ్ము పరిమాణంలో మార్పులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ హార్మోన్ల మార్పుల వల్ల ఒక రొమ్ము పెద్దగా, మరొకటి చిన్నగా అయ్యే అవకాశం ఉంది. అలాగే వాటి ఆకారం కూడా భిన్నంగా ఉంటుంది.
undefined
సాధారణంగా ఆడవాళ్లలో.. ఎడమ రొమ్ము పరిమాణం పెద్దగా, కుడి వైపు రొమ్ము చిన్నగా ఉంటుంది. అయితే కొంతమంది ఆడవారిలో ఇది రివర్స్ కావొచ్చని నిపుణులు అంటున్నారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని కొన్ని సార్లు ప్రెగ్నెన్సీ వల్ల కూడా ఆడవాళ్ల రొమ్ము సైజులో తేడా ఉంటుందట. ఈ టైంలో రెండు వక్షోజాలు పెద్దగా లేదా చిన్నగా అయ్యే అవకాశం ఉంది.
పిల్లలకు పాలిచ్చే మహిళల రొమ్ముల పరిమాణంలో కూడా తేడా ఉంటుంది. తల్లి పాలివ్వడం వల్ల వారి రొమ్ముల పరిమాణంలో చాలా తేడా కనిపిస్తుంది. అయితే మీ రొమ్ము పరిమాణంలో మొదటి నుంచీ తేడా ఉన్నట్టైతే అప్పుడే ఎలాంటి సమస్య లేదు. కానీ మధ్యలోనే రొమ్ముల పరిమాణం అకస్మాత్తుగా పెరిగినా లేదా తగ్గినా అధి వ్యాధుల వల్ల అని అర్థం చేసుకోవాలి.