అవాంఛిత రోమాలు తొలగించేదెలా?

By telugu news team  |  First Published Aug 1, 2020, 2:25 PM IST

కేవలం ఇంట్లో కొన్ని చిట్కాలు పాటించి.. ఈ సమస్యకు పులిస్టాప్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. వాటిని తొలగించడమే కాకుండా.. అందాన్ని మరింత పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.


అవాంఛిత రోమాల సమస్య అమ్మాయిలను విపరీతంగా వేధిస్తుంది. అయితే.. వీటిని ఇప్పటి వరకు పార్లర్ లకు, స్పాలకు వెళ్లి తొలగించుకునేవాళ్లు. అయితే.. ప్రస్తుతం బయట కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. బయటకు వెళ్లలేని పరిస్థితి. దీంతో.. ఈ సమస్యతో బాధపడేవారి సంఖ్య మరింత పెరిగిపోయింది. అయితే.. కేవలం ఇంట్లో కొన్ని చిట్కాలు పాటించి.. ఈ సమస్యకు పులిస్టాప్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. వాటిని తొలగించడమే కాకుండా.. అందాన్ని మరింత పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇదొక్కటే కాదు.. కేవలం పార్లర్ అవసరం లేకుండా అందంగా మెరవాలంటే ఈ చిట్కాలు పాటిస్తేచాలు.

ఓట్స్‌, తేనె, యోగర్ట్‌ కలిపిన మిశ్రమాన్ని ముఖం మీద  స్క్రబ్బర్‌లా రుద్దుకోవాలి. ఇలాచేస్తే మృతకణాలు తొలగిపోతాయి. చర్మం తాజాగా, నిగారింపుతో కనిపిస్తుంది. లేదంటే ఎర్రకంది పప్పును రాత్రంతా నానబెట్టి, పొద్దున్నే పేస్ట్‌లా చేసుకొని ముఖానికి ఫేస్‌మాస్క్‌లా రాసుకున్నా ముఖం వెలిగిపోతుంది. 

Latest Videos

undefined

బ్లాక్‌ టీని కురులకు పట్టిస్తే పట్టులా మెరుస్తూ కనిపిస్తాయి. వారంలో రెండు సార్లు షాంపూతో తలస్నానం చేసిన తరువాత ఇలాచేస్తే ఫలితం ఉంటుంది.

గోళ్లు అందంగా మెరవాలంటే నెయిల్‌ పాలిష్‌తో పాటు మానిక్యూర్‌ తప్పనిసరి. గోళ్ల చివర్లో ఉన్న మృతకణాలను తొలగించి, బాదం నూనె లేదా కొబ్బరి నూనెతో పాలిష్‌ చేయాలి. దాంతో గోళ్ల దగ్గరి చర్మానికి పోషణ లభిస్తుంది.

కొద్దిసేపు వేడినీళ్లలో చేతులు, పాదాలను ఉంచితే ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గిపోతుంది. కండరాల అలసట మాయం అవుతుంది.  

అవాంఛిత రోమాలు తొలగించేందుకు రేజర్‌ అనువైనది కాదు. ఇంట్లో వ్యాక్స్‌ లేకపోతే నిమ్మరసం, చక్కెర, నీళ్లు కలగలిపిన మిశ్రమాన్ని అవాంఛిత రోమాలున్న చోట ప్యాక్‌లా రాయాలి. కొద్దిసేపయ్యాక తొలగిస్తే ప్యాక్‌తో పాటు వెంట్రుకలు వచ్చేస్తాయి.


 

click me!