ముఖానికి ఎగ్ మాస్క్... ఇక మెరిసిపోవాల్సిందే..

By telugu teamFirst Published Dec 13, 2019, 2:45 PM IST
Highlights

కోడిగుడ్డు తెల్ల సొనలో కొద్దిగా ఆలివ్ నూనె, కొన్నిచుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి పూతలాగా రాయాలి. కొద్ది సేపటి తర్వాత అది ఆరిపోతుంది. అప్పుడు దానికి నీటితో కడిగేసుకోవాలి

ముఖం తాజాగా... అందంగా మెరవాలని అందరూ కోరుకుంటారు. అయితే... ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఏది చేద్దామన్నా ముందు సమయమే దొరకదు. మార్కెట్లో దొరికే ఏవైనా క్రీములు వాడినా.. వాటి ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. చాలా మంది యువతులు మొటిమలు, బ్లాక్ హెడ్స్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే... వీటికి కోడిగుడ్డు తెల్ల సొనతో పరిష్కరించవచ్చని నిపుణులుచెబుతున్నారు.

కోడిగుడ్డు తెల్ల సొనలో కొద్దిగా ఆలివ్ నూనె, కొన్నిచుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి పూతలాగా రాయాలి. కొద్ది సేపటి తర్వాత అది ఆరిపోతుంది. అప్పుడు దానికి నీటితో కడిగేసుకోవాలి.ఆ  తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. ముఖం కాంతివంతంగా మారుతుంది. తాజాగా కూడా కనపడుతుంది.

కోడిగుడ్డు తెల్లసొనలో పోషకాలు చర్మానికి పోషణనిస్తాయి. అలాగే బిగుతుగా ఉండేలా సహాయం చేస్తాయి. ఇక నిమ్మరసం బ్లీచ్ లా పనిచేస్తుంది.  ఆలివ్ ఆయిల్ లోని విటమిన్ -ఇ పోషకాలు చర్మంపై ఉండే గీతలు, ముడతలను తగ్గిస్తాయి. అంతేకాకుండా బ్లాక్ హెడ్స్, మొటిమలను పూర్తిగా తగ్గించడానికి సహాయం చేస్తాయి. దీనిని తరచూ వాడటం వల్ల ముఖం మరింత మృదువుగా అందంగా మారుతుంది. 

click me!