ఈ నూనె మీ చర్మం పై మ్యాజిక్ చేస్తుంది..!

By telugu news teamFirst Published Jan 18, 2023, 12:54 PM IST
Highlights

ఈ ఆవనూనెలో... ఎన్నో రకాల ఔషధాలు పుష్కలంగా ఉంటాయి. దాదాపు మనలో చాలా మంది ఆవనూనెను వంటల్లో ముఖ్యంగా పచ్చళ్లలో వినియోగిస్తూ ఉంటారు. వాటికి మాత్రమే కాదు.. మన అందాన్ని పెంచడంలోనూ ఈ నూనె ఉపయోగపడుతుందట.

వర్షాకాలంలో అందరూ ఎక్కువగా చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే... ఈ చర్మ సమస్యలకు చెక్ పెట్టడానికి కేవలం ఒక నూనె వాడితో సరిపోతుందట. అదే ఆవనూనె.  ఈ ఆవనూనెలో... ఎన్నో రకాల ఔషధాలు పుష్కలంగా ఉంటాయి. దాదాపు మనలో చాలా మంది ఆవనూనెను వంటల్లో ముఖ్యంగా పచ్చళ్లలో వినియోగిస్తూ ఉంటారు. వాటికి మాత్రమే కాదు.. మన అందాన్ని పెంచడంలోనూ ఈ నూనె ఉపయోగపడుతుందట. అదెలాగో ఓసారి చూద్దాం...

1. ముల్తానీ మట్టితో ఆవనూనెను మట్టితో కలిపి ఉపయోగించడం వల్ల చర్మానికి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ముందుగా ముల్తానీ మట్టిని కొద్దిసేపు నీటిలో నానబెట్టాలి. తర్వాత అందులో ఆవాల నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్ లాగా అప్లై చేయండి. అరగంట అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇది చర్మాన్ని కాంతివంతం చేయడానికి సహాయపడుతుంది.

2. ఆవాల నూనె, పుదీనాతో మిక్స్ చేసి ముఖం లేదా మొత్తం శరీరంపై అప్లై చేయండి. నూనెను నేరుగా అప్లై చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

3. చలికాలంలో చేతులు పగలడం సర్వసాధారణం. ముఖ్యంగా ముఖం, పెదాలు ఎక్కువగా పగులుతూ ఉంటాయి. ఈ సమస్యకు మస్టర్డ్ ఆయిల్ మంచి మందు. పెదవులు పగిలినట్లైతే రాత్రి పడుకునేటప్పుడు ఒక చుక్క ఆవాల నూనెను రాసి మర్దనా చేయడం వల్ల.. ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

4. ఆవనూనెతో శరీరానికి మసాజ్ చేసి ఎండలో నిలబడితే చర్మ సమస్యలు నయమవుతాయి. 100 గ్రాముల ఆవాల నూనెలో కొన్ని వెల్లుల్లి వేసి బాగా మరిగించాలి. చల్లారాక జుట్టుకు పట్టించి మసాజ్ చేస్తే జుట్టు రాలకుండా ఉంటుంది.

5. చలికాలంలో మడమ పగుళ్లు సర్వసాధారణం. కొన్నిసార్లు పగిలిన మడమ నుండి రక్తం వస్తుంది. ఇలాంటప్పుడు గోరువెచ్చని ఆవాలనూనెలో వెల్లుల్లిని కలిపి పగిలిన మడమల మీద రాస్తే ఈ సమస్య దూరమవుతుంది.

6. మేకప్ తొలగించడానికి చాలా మంది క్లెన్సర్లు వాడుతూ ఉంటారు. లేదంటే అలానే వదిలేస్తారు.  అలా చేయడం వల్ల.. ముఖం పై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది.  కాబట్టి, మేకప్ తొలగించడానికి ఆవాల నూనెను మేకప్ రిమూవర్‌గా ఉపయోగించవచ్చు. చర్మంపై నల్ల మచ్చలు ఉంటే, ఆవాల నూనెను శెనగ పిండిలో  కలిపి ప్యాక్‌లా వేసుకోవచ్చు. ఈ ప్యాక్ చర్మానికి పోషణనిస్తుంది.                                                                                

click me!