రాసిపెట్టుకోండి.. బెంగాల్‌లో 100 సీట్లు కూడా రావు: బీజేపీ నేతలకు పీకే ఛాలెంజ్

By Siva KodatiFirst Published Apr 11, 2021, 2:17 PM IST
Highlights

బెంగాల్‌లో ప్రశాంత్ కిశోర్ ఆడియో టేప్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తాను తన మాటలకు కట్టుబడే వున్నానని స్పష్టం చేశారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్లు కూడా రావని... బెంగాల్లో బీజేపీకి 200 అని గప్పాలు కొడుతున్న వారికి ఆయన సవాల్ విసిరారు. 

బెంగాల్‌లో ప్రశాంత్ కిశోర్ ఆడియో టేప్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తాను తన మాటలకు కట్టుబడే వున్నానని స్పష్టం చేశారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్లు కూడా రావని... బెంగాల్లో బీజేపీకి 200 అని గప్పాలు కొడుతున్న వారికి ఆయన సవాల్ విసిరారు.

బీజేపీకి 200 సీట్లు రాకపోతే ఆ పార్టీ ప్రముఖులంతా రాజకీయ సన్యాసం తీసుకోవాలని.. ఒకవేళ తృణమూల్ మళ్లీ గెలవకపోతే తాను సన్యసిస్తానని ప్రశాంతో కిశోర్ ఛాలెంజ్ చేశారు. మమతను తిట్టడమే బీజేపీ అజెండా అని.. మహిళలంతా మమతకే ఓట్లేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

బీజేపీ పబ్లిసిటీ స్టంట్ బెంగాలీలపై పనిచేయదని.. దేశంలో మోడీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని పీకే ఎద్దేవా చేశారు. మే 2న హెడ్డింగ్‌లో బెంగాల్‌లో తృణమూల్ గెలుపన్న వార్తలు వుంటాయని ఆయన జోస్యం చెప్పారు. 

కాగా, బెంగాల్‌లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనంటూ స్వయంగా ప్రశాంత్ కిశోర్ అంగీకరించారంటూ క్లబ్ హౌస్‌లో పిచ్చాపాటి ఆడియో క్లిప్‌ను రిలీజ్ చేసింది బీజేపీ.  భారతీయ జనతా పార్టీ రిలీజ్ చేసిన ఆ ఆడియో క్లిప్ వింటే మోడీపై ఓ రేంజ్ ప్రశాంత్ కిశోర్ పొగడ్తలు కురిపించినట్లుగా వుంది.

Also Read:‘‘ బెంగాల్‌లో బీజేపీదే విజయం’’.. కలకలం రేపుతున్న ప్రశాంత్ కిశోర్ ఆడియో క్లిప్

దేశంలో మోడీ ప్రభంజనం సృష్టించారని.. బెంగాల్‌లో ఆయన బహిరంగ సభలకు జనం భారీగా వస్తున్నారని ప్రశాంత్ కిశోర్ అన్నారు. కోటి మందికిపైగా హిందీ మాట్లాడేవాళ్లు, 27 శాతం దళితులు పూర్తిగా బీజేపీ వైపు వున్నారని పీకే వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా సర్వేల సమయంలో ఏ ప్రభుత్వం వస్తుందంటే జనం బీజేపీయే అధికారంలోకి వస్తుందని చెప్పారని.. ప్రశాంత్ కిశోర్ స్వయంగా అంగీకరిస్తున్నట్లు ఆడియో క్లిప్ బట్టి తెలుస్తోంది. అయితే పీకే మాట్లాడిన దానిని తమకు అనుకూలంగా ఎడిట్ చేసి ఆ ఆడియో క్లిప్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు బీజేపీ రిలీజ్ చేసిన ఆడియో క్లిప్‌పై స్పందించారు ప్రశాంత్ కిశోర్. తమ నేతల మాటల కంటే తన చాట్‌ను బీజేపీ సీరియస్‌గా తీసుకున్నందుకు ఆనందంగా వుందంటూ చురకలు అంటించారు. అయితే  తన ఛాట్‌లోని ముక్కలపై ఆసక్తి కనబరచడం కంటే మొత్తం ఛాట్‌ను షేర్ చేసే ధైర్యం చూపించి వుంటే బావుండేదని పీకే అన్నారు.

తాను ముందే చెప్పాను.. ఇప్పుడు కూడా అదే చెబుతున్నానను. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ వంద సీట్లకు మించి గెలిచే అవకాశం లేదంటూ ట్వీట్ చేశారు పీకే. గతేడాది డిసెంబర్ 21న బీజేపీ డబుల్ డిజిట్ దాటదని కొన్ని మీడియా సంస్ధలు ఆ పార్టీకి హైప్ క్రియేట్ చేస్తున్నాయంటూ ట్వీట్ చేశారు ప్రశాంత్ కిశోర్. అంతేకాదు తన ట్వీట్‌ను సేవ్ చేసుకోవాలని.. ఒకవేళ బీజేపీ వంద సీట్లు దాటితే ఏకంగా తన వృత్తికే గుడ్‌బై చెబుతానన్నారు

click me!