రంగంలోకి బీజేపీ, ఢిల్లీకి పవన్: వారంలో తేలనున్న అమరావతి భవితవ్యం?

By narsimha lodeFirst Published Jan 12, 2020, 4:40 PM IST
Highlights

అమరావతి చుట్టూ గత వారంలోనూ ఏపీ రాజకీయాలు కొనసాగాయి. అమరావతిలోని రాజధాని కొనసాగించాలని బీజేపీ తీర్మానించింది

అమరావతి:అమరావతి చుట్టూ గత వారంలోనూ ఏపీ రాజకీయాలు కొనసాగాయి. అమరావతిలోని రాజధాని కొనసాగించాలని బీజేపీ తీర్మానించింది. ఈ విషయమై కేంద్రం జోక్యం చేసుకోవాలని బీజేపీ నేతలు కొందరు డిమాండ్ చేశారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ శనివారం నాడు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు.జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఢిల్లీకి రావడం చర్చకు దారితీస్తోంది 

ఈ నెల 20వ తేదీ నుండి విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేసేందుకు ఏర్పాట్లు చేసేందుకు సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది. ఈ మేరకు పలు ప్రభుత్వ శాఖలు తరలించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.

also read:కారణమిదే:కేబినెట్‌లో భారీ మార్పులకు కేసీఆర్ ప్లాన్?

ఇదే సమయంలో అమరావతిలోని రాజధాని కొనసాగించాలని అమరావతి పరిసర ప్రాంతాలకు చెందిన 29 గ్రామాల ప్రజలు తమ ఆందోళన ఉధృతం చేశారు. ఈ ఆందోళనలకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీనారాయణలు కూడా తమ మద్దతు ప్రకటించారు.

also read:తెలంగాణ ఎన్నికల సంఘానికి హైకోర్టు షాక్: మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్ 

 అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన బస్సు యాత్రలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అమరావతి ఆందోళన కోసం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు  బిక్షాటన చేశారు.

Also read:సీఎంగా కేటీఆర్: ప్లాన్ రెడీ,కేసీఆర్ భవిష్యత్తు ఆచరణ ఇదీ?

ఈనెల 11వ తేదీన బీజేపీ కోర్ కమిటీ సమావేశం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని  బీజేపీ తీర్మానించింది.  ఈ విషయంలో  పార్టీలో కొందరు నేతల మధ్య  భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని  కొందరు బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

Also read:వీక్లీ రౌండప్:దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం, కరీంనగర్ కలెక్టర్‌ బదిలీ 

ఈ నెల 11వ తేదీన అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులతో చర్చిస్తామని మంత్రి కొడాలి నాని ప్రకటించారు.  అమరావతిలోని రాజధాని కొనసాగించాలని కృష్ణ గుంటూరు జిల్లాల్లో ఆందోళనలు తీవ్రమయ్యాయి.

 ఈనెల 7వ తేదీన గుంటూరు జిల్లా చినకాకాని వద్ద మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి పై ఆందోళనకారులు దాడికి దిగారు. అదే రోజున మరో ఎమ్మెల్యే అనిల్ అనిల్ టిడిపి కార్యకర్తలు ఘోరావ్ చేశారు.టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు 24 గంటల పాటు దీక్ష చేశారు. ఈ దీక్షకు చంద్రబాబు, లోకేష్ సంఘీభావం ప్రకటించారు. 

Also read: వీక్లీ రౌండప్: మంత్రుల మెడకు మున్సిపల్ ఉచ్చు, కేటీఆర్‌కు సీఎం పదవి?

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ శనివారం నాడు ఢిల్లీకి చేరుకొన్నారు. ఆదివారంనాడు పలువురు బీజేపీ ముఖ్య నేతలను కూడ కలుసుకొనేందుకు వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఎవరెవరిని కలిశారనే విషయమై గోప్యంగా ఉంచారు. 

సీఎం హోదాలో కోర్టుకు జగన్

ఈ నెల 10వ తేదీన సీఎం హోదాలో తొలిసారిగా నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో ఏపీ సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని  సీఎం జగన్ సీబీఐ కోర్టును కోరారు. ఈ విషయమై కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈనెల 17వ తేదీకి ఈ కేసును కోర్టు వాయిదా వేసింది.

మరోవైపు ఆస్తుల కేసులో  ప్రస్తు తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, ఉమ్మడి రాష్ట్రంలో  మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావుకు సిబిఐ కోర్టు నోటీసులు జారీ చేసింది.

Also read:రాజధాని రాజకీయం: అమరావతి భవితపై ఆందోళన, ముంచుతారా తేల్చుతారా?

రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతలు కొందరు తమ ప్రాంతాన్ని కేంద్ర ప్రాంత ప్రాంతంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు వైజాగ్ రాజధానిగా చేస్తే తమకు ఉపయోగమని ప్రశ్నిస్తున్నారు టిడిపి వాళ్ళు ఉన్నారు.

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన మరునాడే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తో జెసి దివాకర్ రెడ్డి భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది .జేసీ దివాకర్ రెడ్డి పైకి టీడీపీలోనే కొనసాగుతానని ప్రకటించారు. జేసీ దివాకర్ రెడ్డి బీజేపీలో చేరుతాననే ప్రచారం కూడ సాగుతోంది.

click me!