ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వైద్యులు ఢిల్లీలో ఆదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. గుంటూరులో వివాహితలు, కాలేజీ అమ్మాయిలతో బీటెక్ విద్యార్ధులు నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేయడం ఈ వారం సంచలనం కలిగించింది. మరిన్ని నేర వార్తలు మీకోసం.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వైద్యులు ఢిల్లీలో ఆదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. గుంటూరులో వివాహితలు, కాలేజీ అమ్మాయిలతో బీటెక్ విద్యార్ధులు నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేయడం ఈ వారం సంచలనం కలిగించింది. మరిన్ని నేర వార్తలు మీకోసం.
వైద్యుడితో కలిసి అదృశ్యమైన వైద్యురాలు:
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన డాక్టర్ హిమబిందు, అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన దిలీప్ సత్య గత నెల 25న అదృశ్యం కావడం సంచలనం కలిగిచింది. వీరిద్దరి ఫోన్లు కావడం, తర్వాత ఆచూకి లేకపోవడంతో హిమబిందు భర్త డాక్టర్ శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Also Read:ఢిల్లీలో కర్నూల్‌కు చెందిన ఇద్దరు డాక్టర్ల మిస్సింగ్
రంగంలోకి దిగిన పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే సాంకేతిక సాయంతో హిమబిందు, దిలీప్‌లు సిక్కింలో ఉన్నట్లు గుర్తించి డాక్టర్ శ్రీధర్‌కు సమాచారం అందించారు. అయితే వీరిద్దరూ సిక్కిం వెళ్లడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
యాప్ సాయంతో సెక్స్ దందాను నడిపిస్తున్న బీటెక్ స్టూడెంట్:
గుంటూరు నందివెలుగు రోడ్డులో గత కొన్నేళ్లుగా సాగుతున్న హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నిడిగొండ వీరబ్రహ్మం అనే బీటెక్ విద్యార్ధి యాప్ తయారు చేసి వివాహితలు, కాలేజీ విద్యార్థినిల ఫోటోలు అందులో అప్‌లోడ్ చేసి సెక్స్ రాకెట్‌ను నిర్వహిస్తున్నాడు.
Also Read:బిటెక్ స్టూడెంట్ కీ రోల్... గుంటూరులో హైటెక్ వ్యభిచారం
ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్న పెళ్లయిన మహిళలు, కాలేజ్ అమ్మాయిలకు డబ్బు ఆశ చూపి అతను వ్యభిచార కూపంలోకి దించాడు. ఈ క్రమంలో వీరబ్రహ్మం అద్దెకు ఉంటున్న ఇంటికి తరచుగా అమ్మాయిలు, అబ్బాయిలు వస్తుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ముఠా గుట్టు రట్టయ్యింది.
అత్తతో వివాహేతర సంబంధం, ఆత్మహత్య:
అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. త్రిపురాంతకం మండలం ముడివేముల గ్రామానికి చెందిన అరిపిరాల రవిశంకర శర్మ అనే వ్యక్తికి చదువుకునే రోజుల్లో మారుతి దేవి అనే వివాహితతో అక్రమ సంబంధం ఏర్పడింది.
దీనిని గమనించిన అతని తల్లిదండ్రులు రవికి డోర్నాలకు చెందిన ఓ యువతితో వివాహం చేశారు. అయితే తమ బంధానికి అడ్డొస్తుందనే సాకుతో మారుతి దేవి.. సదరు యువతితో రవికి విడాకులు ఇప్పించింది. అక్కడితో ఆగకుండా తన కూతురితోనే రవికి పెళ్లి జరిపించింది.
Also Read:అత్తతో వివాహేతర సంబంధం.. చివరకు అల్లుడు ఆత్మహత్య
ఇలా కొంతకాలం గడిచిన తర్వాత మారుతిదేవి అల్లుడిని వదిలేసి సముద్రాల రామాచారి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని హైదరాబాద్‌కు మకాం మార్చింది. అత్త దూరం కావడంతో రవిశంకర్ శర్మ భార్యాపిల్లలను పట్టించుకోవడం లేదు.
తన తల్లితో భర్తకు ఉన్న సంబంధం గురించి రవి భార్యకు తెలియడంతో ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన రవి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
వివాహేతర సంబంధం పెట్టుకుని: అత్తను చంపిన మేనల్లుడు
అత్తతో ఆమె మేనల్లుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆమె పెళ్లి చేసుకోవాలని అడుగుతుండటంతో అత్తను మేనల్లుడే దారుణంగా హత్య చేశాడు. ఏలూరుకు చెందిన నాగమణికి శివాజీ అనే వ్యక్తితో వివాహం జరిగింది.
అయితే అతనికి మతిస్థిమితం లేకపోవడంతో వరుసకు మేనల్లుడయ్యే సంతోష్ కుమార్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో భర్తను వదిలేసి సంతోష్‌ను పెళ్లి చేసుకోవాలని భావించింది.
Also Read:మేనల్లుడితో వివాహేతర సంబంధం... పెళ్లి చేసుకోమని అడగడంతో...
ఇదే విషయాన్ని సంతోష్‌కు చెప్పింది. ఆమెను వదిలించుకోవాలని చూసిన సంతోష్ హత్యకు పథకం పన్నాడు. దొండపాడు సమీపంలోని పంట బోదె వద్దకు తీసుకెళ్లి మేనత్త తలను నీటిలో ముంచి చంపేశాడు.