దిశ నిందితుల మృతదేహాలకురీ పోస్టుమార్టం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్:దిశ నిందితుల మృతదేహాలు ఈ నెల 23వ తేదీన ఆయా కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఈ నెల 21వ తేదీన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Also read:దిశ కేసు నిందితుల మృతదేహాలపై హైకోర్టు కీలక ఆదేశాలు
undefined
ఈ మృతదేహాలకు రీ పోస్టుమార్టం కూడ నిర్వహించాలని కూడ ఆదేశించింది.కరీంనగర్ కల్లెక్టర్ సర్ఫరాజ్ అహ్మాద్‌పై తెలంగాణ సర్కార్ బదిలీ వేటు వేసింది. గద్వాల కలెక్టర్ శశాంకను కరీంనగర్ కలెక్టర్ గా బాధ్యతలను అప్పగించింది.
Also read:దిశ నిందితుల మృతదేహాలు 50 శాతం కుళ్లిపోయాయి: హైకోర్టుకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్
సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టులో సామాజిక కార్యకర్త సజయ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు రెండు రోజుల పాటు విచారించింది. కీలక ఆదేశాలు జారీ చేసింది.
Also read:దిశ నిందితులు: చెన్నకేశవులు భార్య కూడ మైనరే
తెలంగాణ హైకోర్టులో సజయ పిటిషన్‌పై ఈ నెల 20, 21 తేదీల్లో విచారణ సాగింది. దిశ నిందితుల మృతదేహాల సంరక్షణ, కుటుంబసభ్యులకు అప్పగించడంపై విచారణ చేశారు. ఇప్పటికే మృతదేహాలు 50 శాతం కుళ్లిపోయినట్టుగా తెలంగాణ హైకోర్టుకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ శ్రవణ్ చెప్పారు.
Also Read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్: మృతదేహాల అప్పగింతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
దేశంలోని ఇతర ఆసుపత్రుల్లో మృతదేహాలను నెలల తరబడి పాడు కాకుండా కాపాడే సౌకర్యాలు ఉన్న విషయాలు తెలియవని హైకోర్టుకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ శ్రవణ్ హైకోర్టుకు తెలిపారు.
also read:Weekly roundup:దిశ నిందితుల మృతదేహాలు గాంధీలోనే, మరో పోరాటానికి పసుపు రైతులు
దీంతో దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల బృందంతో రీ పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.దిశ నిందితుల రీ పోస్టుమార్టం కార్యక్రమాన్ని వీడియో తీయాలని ఆదేశించింది.
అంతేకాదు నివేదికను హైకోర్టు రిజిష్ట్రార్‌కు అందజేయాలని కోరింది.ఈ నెల 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపుగా రీ పోస్టు మార్టం పూర్తి చేసిన తర్వాత బంధువులకు మృతదేహాలను అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది.
దిశ కేసులో నిందితులుగా ఉన్న ఆరిఫ్, చెన్నకేశవులుకు కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడ జరిగిన కొన్ని ఘటనలతో సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ మేరకు ఈ నిందితుల డీఎన్ఏ రిపోర్టుతో ఈ మూడు రాష్ట్రాల్లో పోలీసుల బృందం విచారణ జరుపుతోంది. హైవేల పక్కన జరిగిన హత్యలకు సంబంధించిన కేసుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఈ నెల 27వ తేదీన ఛార్జీషీట్ దాఖలు చేయనున్నారు. షాద్‌నగర్ కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.
కరీంనగర్ కలెక్టర్ బదిలీ
ప్రస్తుత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌తో కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడిన పోన్ సంభాషణ లీక్ కావడంతో రాజకీయంగా చర్చ సాగింది.ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషీ విచారణ జరిపారు. కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మాద్ ను బదిలీ చేశారు. గద్వాల కలెక్టర్ శశాంకను కరీంనగర్ కు బదిలీ చేశారు.
ఈ ఫోన్ సంభాషణను టీఆర్ఎస్ సీరియస్ గా తీసుకొంది. కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ టీఆర్ఎస్ కు చెందిన ప్రజాప్రతినిధులతో మంచి సంబంధాలు లేవనే ఆ పార్టీ వర్గాల్లో అభిప్రాయాలు ఉన్నాయి.
సర్ఫరాజ్ అహ్మద్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ సమయంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండి సంజయ్‌తో ఫోన్ లో మాట్లాడారు.ఈ ఫోన్ సంభాషణను ఎడిట్ చేసి లీక్ చేశారని కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.