క్రైమ్ రౌండప్: కుల్‌దీప్‌ సెంగార్‌కు జీవిత ఖైదు.. జైపూర్ నిందితులకు ఉరిశిక్ష, మరిన్ని

By sivanagaprasad Kodati  |  First Published Dec 22, 2019, 3:30 PM IST

దేశంలో సంచలనం సృష్టించిన రెండు కేసులపై న్యాయస్ధానాలు ఈ వారం కీలక తీర్పులు వెలువరించాయి. ఉన్నావ్ అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ మాజీ నేత కుల్‌దీప్‌ సెంగార్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే 2008లో జైపూర్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లుకు సంబంధించి నలుగురికి ఉరిశిక్ష విధించింది. వీటిలో పాటు మరిన్ని నేరవార్తలు మీకోసం.
 


దేశంలో సంచలనం సృష్టించిన రెండు కేసులపై న్యాయస్ధానాలు ఈ వారం కీలక తీర్పులు వెలువరించాయి. ఉన్నావ్ అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ మాజీ నేత కుల్‌దీప్‌ సెంగార్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే 2008లో జైపూర్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లుకు సంబంధించి నలుగురికి ఉరిశిక్ష విధించింది. వీటిలో పాటు మరిన్ని నేరవార్తలు మీకోసం.

ఉన్నావ్ కేసు: కుల్‌దీప్ సెంగార్‌కు జీవితఖైదు

Latest Videos

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటనలో యూపీ బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీలోని తీస్‌హజారీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. బాధ్యతగల ప్రజా ప్రతినిధిగా ఉండాల్సిన సెంగార్‌.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని కోర్టు అభిప్రాయపడింది.

Also Read:ఉన్నావ్ రేప్‌ కేసు:బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు జీవిత ఖైదు

అత్యాచార బాధితురాలిని భయపెట్టే విధంగా సెంగార్ వ్యవహరించారని.. ఇందుకు గాను ఆయన జీవితాంతం జూలు శిక్షను అనుభవించాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. నెలరోజుల్లోగా బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని సెంగార్‌ను ఆదేశించింది.

దీనితో పాటు బాధితురాలి కుటుంబానికి భద్రత కల్పించాలని.. ఆమె మరికొన్ని రోజులు ఢిల్లీలో ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

2008 జైపూర్ బాంబు పేలుళ్లు: నలుగురికి ఉరిశిక్ష

2008లో జరిగిన జైపూర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో నలుగురు దోషులకు రాజస్థాన్ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించగా.. ఒకరిని దోషిగా తేల్చింది. 2008 మే నెలలో జైపూర్ పాత నగరంలోని హనుమాన్ ఆలయ సమీపంలో నిమిషాల వ్యవధిలో 9 వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి.

Also read:2008 జైపూర్ పేలుళ్ల కేసు: నలుగురికి మరణశిక్ష విధించిన ప్రత్యేక కోర్టు

ఈ ఘటనలో 80 మంది మరణించగా, 170 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మరో నాలుగు బాంబులను కనుగొని నిర్వీర్యం చేశారు. ఈ ప్రాంతంలోని హనుమాన్ భక్తులు, విదేశీ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు.

ఈ ఘటన వెనుక బంగ్లాదేశ్‌కు చెందిన హర్కతుల్ జిహాదీ ఇస్లామీ(హుజి) అనే ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. మొహమ్మద్‌ షాబాజ్‌ హుస్సేన్‌, మొహమ్మద్‌ సైఫ్‌ అకా కారియోన్‌, మొహమ్మద్‌ సర్వార్‌ అజ్మి, మొహమ్మద్‌ సైఫ్‌ అలియాస్‌ సైఫుర్‌ రహమాన్‌ అన్సారీ, మొహమ్మద్‌ సల్మాన్‌లను నిందితులుగా అదుపులోకి తీసుకున్నారు.

దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం

దిశ నిందితుల మృతదేహాల భద్రత, మృతదేహాల అప్పగింతపై సామాజిక కార్యకర్త సజయ దాఖలు చేసిన పిటిషన్ పై  తెలంగాణ హైకోర్టు శనివారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని సూచించింది. 

Also Read:దిశ నిందితుల మృతదేహాల రీ పోస్టుమార్టం కోసం ఎయిమ్స్ డాక్టర్లు

ఈ నెల 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపుగా రీ పోస్టుమార్టం పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. దిశ నిందితుల మృతదేహాలు ఇప్పటికే 50 శాతం కుళ్లిపోయినట్టుగా గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ శనివారం నాడు హైకోర్టుకు వివరించారు. దీంతో రీ పోస్టుమార్టం నిర్వహించి రిపోర్టులను భద్రపర్చాలని హైకోర్టు ఆదేశించింది.

తెలంగాణకు చెందిన నిపుణులైన వైద్య బృందం నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన విషయాన్ని కూడ అడ్వకేట్ జనరల్ దృష్టికి తెచ్చినా కూడ హైకోర్టు అంగీకరించలేదు. రీ పోస్టుమార్టం చేయాలని ఆదేశించింది. రీపోస్టుమార్టం ప్రక్రియను మొత్తం షూట్ చేసి సీడీలను హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్‌కు అప్పగించాలని సూచించింది.

నాగర్‌కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో శిశువు తల కోసిన వైద్యుడు

నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో డెలీవరీ సమయంలో వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించి శిశువు తలను కోసిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేస్తూ తెలంగాణ ప్రజారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనితో పాటు సదరు వైద్యులపై మెడికల్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. 

డెలీవరి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యుడు శిశువు తల కోసేయడంతో.. బిడ్డ మొండెం తల్లిగర్భంలోనే ఉండిపోయింది. ఈ ఘటనపై అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నివేదిక ఆధారంగా ఆధారంగా కుటుంబసభ్యుల నుంచి నిపుణుల బృందం వివరాలు సేకరించింది.

Also Read:అచ్చంపేట శిశువు మరణంపై సర్కార్ సీరియస్: ఇద్దరు వైద్యుల సస్పెన్షన్

దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ తారాసింగ్ మాట్లాడుతూ.. సదరు గర్భిణీ కుటుంబసభ్యులు మృత శిశువుతోనే ఆసుపత్రికి వచ్చారని చెబుతున్నారు. కుళ్లిన దశ ఉండటంతో డెలివరీ చేసే సమయంలో తల ఊడి వచ్చిందని ఆయన తెలిపారు.

తల్లిని బతికించేందుకు హుటాహుటిన హైదరాబాద్‌ తీసుకెళ్లామని శిశువు తలను పోలీసులకు అప్పగించామని వెల్లడించారు. శుక్రవారం డాక్టర్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బాధితురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో పాటు ఫర్నిచర్ ధ్వంసం చేశారు

 

 

click me!