షాకింగ్.. వెంటపడి వేధించిన వ్యక్తిని చేతులు కట్టేసి.. కత్తితో పొడిచి చంపేసిన యువతి..

By SumaBala Bukka  |  First Published Mar 30, 2023, 10:11 AM IST

తనను వెంటపడి వేధిస్తున్న వ్యక్తిని కత్తితో పొడిచి హత్యచేసిందో యువతి. ఆ తరువాత పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయింది. 


ములుగు : ప్రేమపేరుతో తనను వెంటపడి వేధిస్తున్న ఓ యువకుడిని కత్తితో దారుణంగా పొడిచి చంపేసింది ఓ యువతి. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం పరిధిలో ఓ యువకుడి హత్య కలకలం రేపింది. ఓ యువతిని ఆమె దగ్గరి బంధువు ఒకరు ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. ఎన్నిసార్లు తనకి ఇష్టం లేదని చెప్పినా వినకుండా వెంటపడుతూ మానసికంగా హింసిస్తున్నాడు. అతని నుంచి ఎలా తప్పించుకోవాలో ఆ యువతికి అర్థం కాలేదు. దీంతో ఆ యువకుడిని కత్తితో పొడిచి చంపింది. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయింది. యువకుడిని తను చంపడానికి దారి తీసిన పరిస్థితులను వివరంగా పోలీసులకు తెలిపింది.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఏటూరు నాగారం పరిధిలోని ఎర్రలవాడలో ఉండే రామటెంకి శ్రీనివాస్ అనే యువకుడు జాడి సంగీత అనే స్థానిక యువతిని గత కొద్ది కాలంగా ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని వేధింపులకు గురి చేస్తున్నాడు. శ్రీనివాస్, సంగీతలు దగ్గరి బంధువులు అవుతారు కూడా. ఇద్దరు కుటుంబాలు కూలీ పనులకే వెళుతుంటాయి. ఈ క్రమంలో సంగీత చాలాసార్లు శ్రీనివాస్ కు.. అతడిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టం లేదంటూ సమాధానమిచ్చింది.

Latest Videos

డ్రోన్‌తో యాదాద్రి ఆలయం చిత్రీకరణ: పోలీసుల అదుపులో ఇద్దరు

అయినా శ్రీనివాస్ వేధింపులు ఆగలేదు.. సరికదా రోజురోజుకూ శృతి మించి పోతూ వస్తున్నాయి. ఈ క్రమంలో సంగీత తీవ్రంగా విసిగిపోయింది. ఒక సందర్భంలో శ్రీను వేధింపులు తట్టుకోలేక అతని మీద పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీనివాస్ ను అరెస్టు చేశారు. కొంతకాలం జైలులో ఉండి వచ్చాడు. ఆ తరువాత విడుదలయ్యాడు. అయినా కూడా అతని ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు జైలుకు వెళ్లి వచ్చినా కూడా తీరు మార్చుకోలేదు. పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడి వేదించడం మానలేదు.

ఈసారి మద్యం మత్తులో.. ఆమె ఇంటికి వెళ్లి వేధించడం మొదలు పెట్టాడు. అతని వేధింపుల నుంచి తప్పించుకోవడానికి ఆమెకు వేరే మార్గం కనిపించలేదు. మద్యం మత్తులో ఉన్న శ్రీనివాసును చేతులు కట్టేసి.. కత్తితో పొడిచి చంపింది. ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లింది. ఇన్నాళ్లుగా తనను వేధిస్తున్న శ్రీనివాస్ ను ఎలా చంపిందో పోలీసులకు పూర్తిగా వివరించింది. వాళ్ల ఎదుట లొంగిపోయింది. శ్రీనివాస్ హత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. పోటీకి దూరంగా బీఆర్ఎస్.. ఎందుకంటే ?

అమ్మాయిల వెంటపడి వేధిస్తున్న ఆకతాయిలకు సరైన గుణపాఠం చెప్పిందని కొంతమంది దీనిమీద అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది అతని కోసం తన జీవితాన్ని జైలు పాలు చేసుకుందంటూ సానుభూతి చూపిస్తున్నారు. ఇష్టం లేదన్నా వెంటబడి, వేధించే ఇలాంటి వారితో అమ్మాయిల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆడపిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్రభయాందోళనలు కలిగించింది.

click me!