టీఆర్ఎస్ నేతపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

Published : Sep 18, 2019, 07:15 AM ISTUpdated : Sep 18, 2019, 07:18 AM IST
టీఆర్ఎస్ నేతపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

సారాంశం

వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో టీఆర్ఎస్ నేత వెంకన్నపై గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం నాడు దాడికి దిగారు.

హైదరాబాద్: వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో టీఆర్ఎస్ నాయకుడు అంబటి వెంకన్నపై బుధవారం నాడు తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

బుధవారం నాడు తెల్లవారుజామున తన భార్యతో కలిసి వెంకన్న మార్నింగ్ వాక్ కు వెళ్లాడు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడికి దిగారు. భూతగాదాలతోనే అతడిపై దాడి జరిగిందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ దాడిని అడ్డుకొనేందుకు ప్రయత్నించిన వెంకన్న భార్యపై కూడ దుండగులు దాడికి ప్రయత్నించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి: బీఆర్ఎస్‌కు కడియం కౌంటర్
బీఆర్ఎస్‌కు షాక్: కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి