వరంగల్ లో మరో ఇద్దరు కరోనా వైరస్ అనుమానితులు ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన దంపతులు గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతూ ఎంజీఎంకు వచ్చారు.
వరంగల్: వరంగల్ లో మరో ఇద్దరు కరోనావైరస్ అనుమానితులు ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే ఓ విద్యార్థి కరోనావైరస్ అనుమానంతో ఆస్పత్రిలో చేరాడు. అతని రక్తనమూనాలను తీసి పూణేలోని ల్యాబ్ కు పరీక్షల కోసం పంపించారు. ఇందుకు సంబంధించిన నివేదిక శుక్రవారం రాత్రి వస్తుంది.
ఆ నివేదికలో కరోనావైరస్ నెగెటివ్ వస్తే డిశ్చార్జీ చేసే అవకాశం ఉంది. ఈ స్థితిలోనే ఇద్దరు వ్యక్తులు కరోనావైరస్ సోకిందనే అనుమానంతో ఎంజీఎంకు వచ్చారు. గత రెండు రోజులుగా వాళ్లు జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. వారిద్దరు కూడా దుబాయ్ నుంచి వచ్చిన దంపతులు
Also Read: కరోనా ఎఫెక్ట్: భారత్, దక్షిణాఫ్రికా సిరీస్ రద్దు
తమ ఫిజిషియన్ ఇచ్చిన సలహా మేరకు వారు ఎంజీఎం ఆస్పత్రికి వచ్చారు. అయితే, వారిని వైద్యులు ఎమర్జెన్సీ వార్డు వద్ద కూర్చోబెట్టారు. దీంతో వారికి సంబంధించిన బంధువులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పరీక్షలు నిర్వహించిన స్పెషల్ వార్డుకు పంపిస్తామని చెబుతున్నారు.
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచంలోని 114 దేశాలకు విస్తరించింది. దీని బారినపడి ఇప్పటి వరకు 4 వేల మంది మరణించగా, లక్షకు పైగా ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఈ మహమ్మారి భారతదేశంలోనూ పంజా విసురుతోంది.
Also read: సుప్రీంకోర్టుపై కరోనా ఎఫెక్ట్: ఎమర్జెన్సీ అయితేనే విచారణ
మనదేశంలో ఇప్పటి వరకు 78 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కేరళలో అత్యధికంగా 17 కేసులు నమోదవ్వగా, మహారాష్ట్రలో 11, యూపీలో 10, ఢిల్లీలో 6, కర్ణాటకలో 5, ఏపీ, తెలంగాణ, పంజాబ్, రాజస్థాన్‌లలో ఒక్కో కేసు నమోదయ్యాయి. వీరిలో 17 మంది విదేశీయులు కాగా, మిగిలిన వారంతా భారతీయులే.