కీచక పూజారి: గుడిలోనే... మహిళ ఎస్సైతో అసభ్య ప్రవర్తన, గతంలోనూ ఆరోపణలు

By Siva Kodati  |  First Published Feb 23, 2020, 8:42 PM IST

వరంగల్‌లోని ప్రఖ్యాత వేయి స్తంభాల గుడిలో ఓ మహిళా ఎస్సై పట్ల పూజారి అసభ్యంగా ప్రవర్తించాడు. 


వరంగల్‌లోని ప్రఖ్యాత వేయి స్తంభాల గుడిలో ఓ మహిళా ఎస్సై పట్ల పూజారి అసభ్యంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళితే.. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని వేయి స్తంభాల ఆలయంలో ఓ మహిళా ఎస్సై వీఐపీ క్యూలైన్‌ వద్ద బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు.

Also Read:ప్రేమ పేరుతో బాలికను ట్రాప్ చేసిన పూజారి: అత్యాచారం, బ్లాక్‌మెయిల్

Latest Videos

ఈ క్రమంలో ఆలయ పూజారి సందీప్ శర్మ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అతని వికృతీ చేష్టలపై ఖంగుతిన్న ఎస్సై ఇదేమిటని ప్రశ్నించగా.. తమతో తాకించుకుంటేనే డ్యూటీ వేయించుకోవాలని, లేదంటే ఇక్కడకు రావొద్దని దురుసుగా బదులిచ్చాడు.

విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై ఆమె హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:దైవ దర్శనానికి వచ్చిన యువతిపై కన్నేసిన పూజారి

అయితే గతంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బందోబస్తు విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లతోనూ సందీప్ శర్మ అసభ్యకరంగా ప్రవర్తించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. కీచక పూజారి సందీప్ శర్మపై చర్యలు తీసుకోవాలని పలువురు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. 
 

click me!