మేడారం జాతరలో మగబిడ్డను ప్రసవించిన గర్భిణీ: అద్భుతం అంటోన్న భక్తులు

By Siva Kodati  |  First Published Feb 6, 2020, 6:35 PM IST

మేడారం ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు ఓ భక్తురాలు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెలితే మహారాష్ట్ర పుణె సమీపంలోని చువ్వ గ్రామానికి చెందిన చావన్ శివాని నిండు గర్బిణీ. 


మేడారం ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు ఓ భక్తురాలు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెలితే మహారాష్ట్ర పుణె సమీపంలోని చువ్వ గ్రామానికి చెందిన చావన్ శివాని నిండు గర్బిణీ. సమ్మక్క సారాలమ్మలను దర్శించుకోవాలనే తపనతో ప్రసవం తారీఖు దగ్గరపడ్డా లెక్కచేయకుండా మేడారానికి మంగళవారం కుటుంబంతో సహా చేరుకున్నారు.

గద్దెలపైకి వనదేవతలు.. మేడారం జనసంద్రం (ఫోటోలు)

Latest Videos

గురువారం ఉదయం పురిటి నొప్పులు రావడం తో మేడారం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఉదయం 11.38  గంటలకు సాధారణ ప్రసవం జరిగింది.   మొదటి సంతానంగా ఆడబిడ్డ వుందని ఇప్పుడు తల్లి సన్నిధిలో  మగబిడ్డ పుట్టడం చాలా ఆనందంగా ఉందని శివాని తెలిపారు.

ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది మంచి సేవలు అందించారని ఆమె ప్రశసించారు. ఇటువంటి దట్టమైన అటవీ ప్రాంతంలో ఆసుపత్రి ఏర్పాటు చేసి తన లాంటి భక్తులకు సరైన సమయంలో వైద్య సేవలు అందించడం పట్ల శివానీ ఆనందం వ్యక్తం చేసింది. బాబు 3 1/2 కేజీల బరువుతో పుట్టాడని.. ప్రస్తుతం తల్లీ,బిడ్డా క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

Also Read:మేడారం జాతరకు కరోనా వైరస్ ముప్పు..?

కాగా గురువారం సమ్మక్క తల్లీ గద్దెపైకి రానుంటంతో నేడు కీలక ఘట్టం జరగనుంది. చిలకలగుట్టపై కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను మేడారానికి ఊరేగింపుగా తీసుకురానున్నారు. ఈ సమయంలో జాతర ప్రాంగణం మరింత శోభాయమానంగా మారనుంది. 

click me!