విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయాలన్ని సీఎం జగన్ నిర్ణయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు స్వాగతించారు. తమ ప్రాంతానికి న్యాయం చేయాలన్ని జగన్ ను అభినందిస్తున్నట్లు తెలిపారు.
విశాఖపట్నం: ఆసియాలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం నుండి పరిపాలన చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయమని వైయస్సార్సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. తాను ఓ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాకుండా ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తిగా జగన్ ను ప్రశంసిస్తున్నట్లు తెలిపారు.
గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగినా ఇవ్వనీ నాయకుడయితే ప్రస్తుత సీఎం జగన్ ప్రజలకు అడక్కుండానే వరాలు ఇచ్చే నాయకుడని అన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధి చేయాలనే సీఎం ఆలోచనలను ప్రజలు అభినందిస్తుంటే చంద్రబాబు మాత్రం విషపూరితం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
READ MORE రాజధానిపై క్లారిటీవచ్చేది ఎప్పుడంటే: మంత్రి మోపిదేవి
ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ లో వున్న చంద్రబాబు అతనిపై పోటీ చేస్తానని సవాల్ చేశారని గుర్తుచేశారు. అయితే ఆ పార్టీ ఓడిపోవడంతో కేవలం వారం రోజుల్లోనే పదవి కోసం ఎన్టీఆర్ పంచన చేరారని అన్నారు. ఎన్టీఆర్ కేవలం తన కూతురు భువనేశ్వరి కోసమే చంద్రబాబుని పార్టీలోకి తీసుకున్నారని.... అయితే చివరకు చంద్రబాబు చేతిలోనే ఎన్టీఆర్ మోసపోయి ప్రాణాలు కోల్పవాల్సి వచ్చిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏడు వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు. అందులోభాగంగానే రాజధానిపై నిర్ణయం తీసుకున్నారని... దీన్ని ఎవరూ అడ్డుకోలేరని దాడి పేర్కొన్నారు.
READ MORE ఏపి రాజధానిపై గందరగోళం... హైపవర్ కమిటీ ఆలోచన ఇదే