విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటనలో ఆగని చావులు... మరొకరి మృతి

By Arun Kumar P  |  First Published Jun 8, 2020, 7:22 PM IST

  ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో తాజాగా మరొకరు మృతిచెందారు.  


విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో తాజాగా మరొకరు మృతిచెందారు. స్టైరీన్ లీక్ ప్రమాదంలో తీవ్ర అస్వస్థతతో వెంకటాపురం గ్రామానికి చెందిన కడలి సత్యనారాయణ కేజీఎచ్​లో చికిత్స పొందారు. అనంతరం కోలుకుని ఇంటికి వచ్చిన తర్వాత సోమవారం అనారోగ్యానికి గురయి తాజాగా మృతిచెందాడు.

ఎల్జీ పాలిమర్స్ నుండి విడుదలైన గ్యాస్ స్టైరిన్ విషవాయువును పీల్చుకుని రడలి సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యాడు. ఆ తర్వాత కోలుకుని ఇంటికి వచ్చాక కొన్ని రోజుల తర్వాత మళ్లీ అనారోగ్యంపాలయ్యాడు. దీంతో బంధువులు వెంటనేఅతన్ని దగ్గర్లోని ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రెండు రోజులు చికిత్స తీసుకుని మళ్లీ కోలుకున్నాడు. తాజాగా మరోసారి అస్వస్థతకు గురై చివరకు ప్రాణాలు కోల్పోయాడు.   

Latest Videos

undefined

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌ (ఎన్‌జీటీ)లో విచారిస్తోంది. ఈ ప్రమాదం జరగడానికి కారణాలు తదితర అంశాలపై దర్యాప్తు చేపట్టిన ఐదుగురు సభ్యుల కమిటీ ఎన్జీటీకి నివేదిక సమర్పించింది.

read more  విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన... నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు

 స్టైరిన్ గ్యాస్ లీక్ మానవ తప్పిదమేనని ఈ కమిటీ నివేదికలో పేర్కొంది. భద్రతా ప్రమాణాల వైఫల్యం, సంస్థ నిర్లక్ష్యమే ఇంతటి విషాదానికి కారణమని సభ్యులు నివేదికలో పొందుపరిచారు. దీనిపై స్పందించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ .. కమిటీ నివేదికపై అభ్యంతరాలు చెప్పాలని ఎల్జీ పాలిమర్స్‌కు గడువు ఇచ్చింది. ఎల్జీ పాలిమర్స్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర వాదనలు వినిపించారు. గ్యాస్ లీక్ ఘటనపై కేసును సుమోటాగా స్వీకరించే అధికారం.. ఎన్జీటీకి లేదని పాలిమర్స్ సంస్థ వాదనలు వినిపించింది.

మరోవైపు ఈ గ్యాస్ లీక్ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈఏఎస్ శర్మ కోరారు. కాగా గ్యాస్ లీక్ జరిగి 12 మంది ప్రాణాలు పోవడానికి అసలు కారణం విశాఖలోని పరిశ్రమల శాఖేనని ప్రభుత్వం నియమించిన కమిటీ తేల్చింది. సీనియర్ అధికారి నీరబ్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ హై పవర్ కమిటీకి ఈ నివేదికను రెండు రోజుల క్రితం పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో నియమించిన కమిటీ అందజేసింది. ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరగడానికి డీసీఐ ఆఫ్ ఫ్యాక్టరీస్ విశాఖపట్నం అధికారి కేబీఎస్‌ ప్రసాద్ నిర్లక్ష్యమే కారణమని నియమించిన కమిటీ అభిప్రాయపడింది.

ఇంతవరకు ఆ కంపెనీ చుట్టుపక్కల ఏనాడు కూడా మోక్ డ్రిల్ల్ నిర్వహించిన పాపాన పోలేదని, అంతే కాకుండా అక్కడి ప్రజలకు కనీసం ఆపత్కాలీన సమయంలో ఎలా తప్పించుకోవాలో కనీస అవగాహన కూడా కల్పించలేదని ఆ కమిటీ అభిప్రాయపడింది.

click me!