విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ తీవ్ర ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీక్ కావడంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గల ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని గోపాలపట్నం పరిధిలో గల ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఆ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైంది. ఆ విషవాయువు దాదాపు 3 కిలోమీటర్ల మేర విస్తరించింది. బుధవారం ఆర్థరాత్రి దాటిన తర్వాత విషవాయువు లీకైంది.
విషయవాయువుతో చర్మంపై దద్దుర్లు, కళ్ల మంటలో, కడుపులో వికారం పుట్టడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇళ్లు వదిలేసి మేఘాద్రి గెడ్డ వైపు పరుగులు తీశారు. ఐదు గ్రామాల ప్రజలను అధికారులు అధికారులు తరలిస్తున్నారు.
undefined
తీవ్ర అస్వస్థకు గురైనవారిని అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలిస్తన్నారు. అస్వస్థకు గురైనవారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, విశాఖ నగరం పోలీసు కమిషనర్ ఆర్ కె మీనా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్య సిబ్బంది ఆర్ఆర్ వెంకటాపురం ప్రాంతానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గురువారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో విషవాయులు లీలకైనట్లు అధికారులు గుర్తించారు. రసాయన వాయువు లీకేజీని అదుపు చేసేందుకు అధికారులు, సిబ్బంది ప్రయత్నాలు సాగిస్తున్నారు.