దేవుడి బంగారమంటూ ఎర చూపి... కోటిన్నరకు టోకరా: ముగ్గురు నిందితులు అరెస్ట్

By Arun Kumar PFirst Published Sep 9, 2020, 9:50 PM IST
Highlights

సింహాద్రి  అప్పన్న బంగారాన్ని తక్కువ ధరకు ఇప్పిస్తామంటూ ఆన్లైన్ ద్వారా కోటి నలభై నాలుగు లక్షలు కాజేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 

విశాఖపట్నం: ఉత్తరాంద్ర ప్రజలు  ఆరాధ్య దైవంగా కొలిచే సింహాద్రి  అప్పన్న బంగారాన్ని తక్కువ ధరకు ఇప్పిస్తామంటూ ఆన్లైన్ ద్వారా కోటి నలభై నాలుగు లక్షలు కాజేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ముద్దాయిలకు సంబంధించిన మరిన్ని వివరాలను గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రైమ్ డీసీపీ సురేష్ బాబు వెల్లడించారు.

వీడియో

"

సూళ్లూరుపేటకు చెందిన శ్రావణి అనే మహిళ నుండి సెప్టెంబర్ 3 వ తేదీన సింహాచలం ఆలయ ఈవోకు సోషల్ మీడియా ద్వారా మెయిల్ రావడం జరిగిందన్నారు. ఇటీవల దేవస్థానం నిర్వహించిన బంగారం వేలంలో కోటి నలభై నాలుగు లక్షల రూపాయలకు కోన హైమావతి అనే మహిళ ద్వారా  బంగారం కొనుగోలు చేయడం జరిగిందని... అయితే ఇప్పటి వరకు దేవస్థానం నుండి తాను కొనుగోలు చేసిన బంగారం అందలేదంటు ఫిర్యాదు చేసింది. 

దీంతో అప్రమత్తమైన అప్పటి ఆలయ ఈవో భ్రమరాంబ దర్యాప్తు చేయగా మోసం జరిగినట్లు తేలింది. బాధిత మహిళ వద్ద బంగారం కొనుగోలు చేసినట్లుగా రెండు బిల్లులు వుండగా అందులో తన సంతకం ఫోర్జరీ జరిగినట్లు ఈవో గుర్తించారు. దీంతో ఆమె వెంటనే పోలీసులకు పిర్యాదు చేశారు. 

read more  సింహాచలం అప్పన్న బంగారం పేరిట... రూ.1.44 కోట్లకు టోకరా

ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆన్లైన్ ద్వారా మోసానికి పాల్పడిన హైమావతి అనే మహిళతో పాటు వాసు, తేజ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.వారిని రిమాండ్ తరలించడం జరిగిందని క్రైమ్ డీసీపీ సురేష్ బాబు పేర్కొన్నారు.

 

click me!