జగన్ గారు... ఆ విషయంలో కేసీఆర్ ను ఫాలో కండి: టిడిపి ఎమ్మెల్యే గణబాబు (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 08, 2020, 01:26 PM IST
జగన్ గారు... ఆ విషయంలో కేసీఆర్ ను ఫాలో కండి: టిడిపి ఎమ్మెల్యే గణబాబు (వీడియో)

సారాంశం

భౌతిక దూరం పాటించి తరగతులు నిర్వహించేందుకు ప్రస్తుత తరగతుల గదులు సరిపోవు  కావున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి జగన్ సర్కార్ కు విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు సూచించారు. 

విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ లో పాఠశాలలు వచ్చే వారం నుంచి తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయంపై మరోసారి పునః సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు కోరారు. ప్రస్తుతం విశాఖ నగరంలో ప్రతి వీధిలో కరోనా కేసులు ఉన్నాయని... ఇలాంటి సమయంలో స్కూళ్లను తెరవాలన్ని నిర్ణయం మంచిది కాదన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో ఒకసారి విద్యార్థుల తల్లితండ్రులు, అధ్యాపకులను సంప్రదించి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. 

''భౌతిక దూరం పాటించి తరగతులు నిర్వహించేందుకు ప్రస్తుత తరగతుల గదులు సరిపోవు  కావున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. తెలంగాణ, కేరళ రాష్ట్రాలు మాదిరి ఆన్లైన్లో, టీవీ మాధ్యమాల్లో ప్రభుత్వ పాఠశాల తరగతులు నిర్వహించేందుకు ఆలోచించాలి'' అని సూచించారు. 

వీడియో

"

''ఇప్పటికే ప్రభుత్వ మద్యం దుకాణాలు వలన సమాజం ఎంతో అసహ్యించుకుంటుంది. అవే దుకాణాలు ఇప్పుడు కరోనా హాస్పిటల్స్ లా తయారయ్యాయి. ఇక మన పాఠశాలలకు అదే ముద్ర పడనుంది అనే భయం ప్రజల్లో ఉంది. ఇంటింటికి పంచుతామని  ప్రకటించిన  మాస్కులు ఇప్పటికి నగరంలో అందలేదన్నారు. కేంద్రం అన్ లాక్ 4.0  ప్రకటించనుందని... అది వెలువడేవరకు వేచి ఉంది నిర్ణయం తీసుకుంటే మంచిది'' అని ఎమ్మెల్యే గణబాబు ప్రభుత్వానికి సూచించారు. 

  

PREV
click me!

Recommended Stories

విశాఖలో స్పా ముసుగులో చీకటి దందా
Yoga Day: విశాఖలో యోగా డే.. ఐదు లక్షల మందితో గిన్నిస్ రికార్డు