వరలక్ష్మి హత్య కేసు : వేరే వ్యక్తితో క్లోజ్ గా ఉండటాన్ని తట్టుకోలేకనే..

By AN TeluguFirst Published Nov 3, 2020, 2:29 PM IST
Highlights

ఉన్మాది చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. విశాఖ పోలీసులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు అఖిల్ సాయి 14 రోజుల రిమాండ్ మీద సెంట్రల్ జైలుకు వెళ్లాడు. 

ఉన్మాది చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. విశాఖ పోలీసులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు అఖిల్ సాయి 14 రోజుల రిమాండ్ మీద సెంట్రల్ జైలుకు వెళ్లాడు. 

ఈ కేసులో ఇతరుల ప్రమేయంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో హోంమంత్రి ఈ కేసులో మరింత లోతుగా విచారించాలని ఆదేశించారు. ఈ విచారణలో వరలక్ష్మి మరో యువకుడు రామ్‌తో చనువుగా ఉండటాన్ని భరించలేకే అఖిల్ సాయి హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. 

ఈ హత్యకు ముందు గత నెల 29న అఖిల్ సాయి గాజువాకలో రౌడీషీటర్ గేదెల రాజు కొడుకు సూర్యనారాయణ రాజుతో కలిసి రామును బెదిరించడమే కాకుండా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద దాడి కూడా చేసినట్లు గుర్తించారు. ఆ సమయంలో వరలక్ష్మి సోదరుడు జై ప్రకాష్ కూడా ఉన్నాడు. 

వరలక్ష్మితో రాము సన్నిహితంగా ఉంటున్నాడని చెప్పి వరలక్ష్మి సోదరుడు జై ప్రకాష్‌ను రెచ్చ గొట్టి ఈ దాడికి పాల్పడ్డాడు. అయితే వరలక్ష్మి హత్యలో ఈ రౌడీషీటర్ గేదెల రాజు కొడుకు ప్రమేయం ఏ మేరకు ఉందన్న కోణంలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. 

అయితే తాను కేవలం బండి మాత్రమే నడిపానని, రామునాయడిపై దాడి చేసింది అఖిల్‌ అని జయప్రకాష్‌ స్వయంగా పోలీసుల ముందు అంగీకరించినట్లు చెబుతున్నారు.   

click me!