అపైర్ అనుమానం: భార్యపై భర్త యాసిడ్ దాడి, కూతురికీ గాయాలు

By telugu teamFirst Published 31, Oct 2020, 12:45 PM
Highlights

ఏపీలోని విశాఖపట్నంలో దారుణ సంఘటన జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. తల్లిని కాపాడడానికి అడ్డుపడిన కూతురు కూడా గాయపడింది.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో దారుణమైన సంఘటన జరిగింది. భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానంతో భార్యపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. తల్లిని కాపాడేందుకు ప్రయత్నించిన కూతురు కూడా ఆ ఘటనలో గాయపడింది. 

యాసిడ బాత్రూం క్లీనింగ్ కు వాడేది కావడంతో గాయాల తీవ్రత ఎక్కువగా లేదు. విశాఖలోని శివాజీపాలెంలో ఈశ్వర రావు అనే వ్యక్తి భార్య దేవి, కూతురు గాయత్రిలతో కలిసి జీవిస్తున్నాడు. అయితే, ఈశ్వర రావుకు భార్యపై అనుమానం పెరిిగంది. దీంతో తరుచుగా ఇంట్లో గొడవలు జరుగుతూ వస్తున్నాయి.

ఈ క్రమంలో శనివారం ఉదయం ఈశ్వర రావు భార్య భూదేవిపై దాడికి దిగాడు. బాత్రూంను శుభ్రపరిచే యాసిడ్ ను భార్యపై పోశాడు. ఆ సమయంలో కూతురు గాయత్రి అడ్డు వచ్చింది. దాంతో గాయత్రికి స్వల్పంగా గాయాలయ్యాయి. 

పెయింటింగ్ పని చేసే ఈశ్వర రావు మద్యానికి బానిసై 500 రూపాయలు అడిగాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ పెరిగింది. అప్పటికే భార్యపై అనుమానం ఉ్న ఈశ్వర రావు దాడికి దిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఫిర్యాదులు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.

Last Updated 31, Oct 2020, 3:56 PM