గాజువాకలో నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్... రూ.40లక్షల డిమాండ్

Arun Kumar P   | Asianet News
Published : Nov 01, 2020, 02:46 PM ISTUpdated : Nov 01, 2020, 02:48 PM IST
గాజువాకలో నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్... రూ.40లక్షల డిమాండ్

సారాంశం

నాలుగేళ్ల బాలుడిని కిడ్నాపర్ల బారినుండి కేవలం గంటల వ్యవధిలోనే కాపాడారు గాజువాక పోలీసులు. 

 విశాఖపట్నంలోని గాజువాకకు చెందిన ఓ నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు. అయితే వెంటనే అప్రమత్తమైన స్థానిక పోలీసులు చాకచక్యంగా వ్యవహరించిన గంటల వ్యవధిలోనే బాలున్ని సురక్షితంగా కాపాడారు. దీంతో బాలుడి తల్లిదండ్రులే కాదు గాజువాక వాసులు ఊపిరి పీల్చుకున్నారు. 

ఈ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గాజవాకలోని ఆటోనగర్ ప్రాంతంలో రాజస్థాన్ కు చెందిన నరేష్ యాదవ్ కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఇతడు స్వయంగా ఓ పరిశ్రమను నడుపుతున్నాడు. ఈ పరిశ్రమ కోసం తీసుకున్న రూ.40లక్షల అప్పును చెల్లించకపోవడంతో అతడి కుమారున్ని కిడ్నాప్ చేసిన దుండగులు వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. 

దీంతో తీవ్ర ఆందోళన చెందిన నరేష్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి కిడ్నాపర్ల ముఠా నుండి బాలున్ని కాపాడారు. మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు... ఈ కిడ్నాప్ తో ఇంకా ఎవరెవరికి సంబంధముందన్న దానిపై దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. తమ కొడుకు సురక్షితంగా ఇంటికి చేర్చిన పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

విశాఖలో స్పా ముసుగులో చీకటి దందా
Yoga Day: విశాఖలో యోగా డే.. ఐదు లక్షల మందితో గిన్నిస్ రికార్డు