ఔనన్న కాదన్న అన్ని రాష్ట్రాలూ ఆ చట్టాన్ని అమలు చెయాల్సిందే: కేంద్ర మంత్రి

By Rekulapally Saichand  |  First Published Jan 5, 2020, 6:13 PM IST

"పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంట్ ద్వారా ఆమోదం పొందిన చట్టం కొన్ని రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తే, అక్కడ అసెంబీల్లో తీర్మానాలు చెస్తే ఒరిగెదేం లేదు. అన్ని రాష్ట్రాలూ చట్టం అమలు చేసి తీరాలని లేకపోతే రాజ్యాంగం ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో కేంద్రం నిర్ణయిస్తుంద"ని కేంద్ర  మంత్రి ఆర్కే సింగ్ 


కేంద్ర విద్యుత్, ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. " పౌరసత్వ సవరణ చట్టం దేశ పౌరసత్వం ఇవ్వటానికి సంబంధించినది. దేశ పౌరులకు దీనికి సంబంధమే లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ విద్వేషాలు రెచ్చకొడుతోంది. దేశ విభజన సమయంలో విడిపోయిన ప్రాంతాల్లో ఉండిపోయిన మైనారిటీలు వివక్షకు, హింసకు గురై మన దేశానికి వస్తే వారికి పౌరసత్వం ఇవ్వాలని ఆ చట్టం నిర్దేశిస్తోంది. అక్కడ నేరాలు చేసి లేదా ఇక్కడ నేరాలు చేయటానికి వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వటం ఈ చట్టం లక్ష్యం కాదు" అన్నారు


"ఇది పార్లమెంట్ ద్వారా ఆమోదం పొందిన చట్టం. కొన్ని రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తే, అక్కడ అసెంబీల్లో తీర్మానాలు చెస్తే ఒరిగెదేం లేదు. అన్ని రాష్ట్రాలూ చట్టం అమలు చేసి తీరాలి. లేదా అక్కడ పాలన కట్టు తప్పిందని నిర్ణయించి రాజ్యాంగం ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో కేంద్రం నిర్ణయిస్తుంది. ముస్లిములలో అపోహలు రేకెత్తించటానికి, తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందటానికీ కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. వారి ఉచ్చులో పడరాదని కోరుతున్నాం. దేశ వ్యాప్తంగా ఈ చట్టానికి మద్దతుందని" తెలిపారు.  

Latest Videos

undefined

 

మాజీ ఎంపి హరిబాబు మాట్లాడుతూ...

"ప్రజల్లో ఈ చట్టం మీద జరిగిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టటానికి కరపత్రం విడుదల చేశాము. దేశ వ్యాప్త పంపిణిలో భాగంగా విశాఖలో దీన్ని కేంద్ర మంత్రి విడుదల చేశారు. కార్యక్రమాన్ని ప్రారంభించి కొన్ని ఇళ్లను సందర్శించి అవగాహన కల్పించారు. ఆర్కే సింగ్ రిటైర్డ్ ఐఎఎస్ ఆఫీసర్. హోంశాఖలో సెక్రటరీగా పనిచేశారు. ఆయనకు చట్టం, రాజ్యాంగం క్షుణ్నంగా తెలుస"న్నారు

click me!